పుట:Manooshakti.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

37

ఇట్టి గ్రంథములవ్రాయ నందుదహరించిన వానిని జేసిచూడ నొక్కటియును గాక మిక్కిలి విసుగునుజెంది, అహో యీ గ్రంథములందు రచించినవానియం దొక్కటియును గావని ప్రతి మెస్మరిజగ్రంధమునందును మిక్కిలి యగౌరవమును జూపుచున్నారు. మరియు చదువరులు గ్రంథమునందు రచించినవానిమాడ్కి, సరిగా ప్రవతిన్ంపక వ్యతిరేకముగ ప్రవతిన్ంచిన కారణమునను చెప్పినట్లు జరుగుటకూడ లేకయున్నది. అహో, యీవిషయము మన హిందూదేశీయులకెల్లరకు నవమానకరమైనవిషయమై యున్నది. గాన బూటకములను కొన్నింటిని జేర్చి ధనార్జననిమిత్తమై పెక్కండ్రకు సమ్మకములేకుండగ జేయుచు దేశమునకు క్షీణదశను దెచ్చుగ్రంధములను వ్రాయకుండగ నూరకుండిన మేలుగా గానుపించు చున్నది.

నీమాటను ప్రతివారంగీకరించునట్లు జేయుట.

నీవేదైన నొకమాటను లోకులందరిచే యొప్పుకొనునట్లు జేయనెంచినయెడల వారిముఖములను జూచుచు “నేను జెప్పబోవునదంతయును మీరంగీకరింతురుగాక" అని దృఢముగా ననుకొనినపిమ్మట నీవు చెప్పదలచినది చెప్పుము. అప్పుడు నీవేదిచెప్పిన నది యందరంగీకరింతును. చూచితివా ! నీమనోశక్తివలన ప్రతివారి నెట్లులోబరుచుకొనగలుగుచున్నావో !

పిల్లవానిని నిద్రపుచ్చుట.

నీవొకపిల్లవానిని రప్పించి సౌఖ్యముగా పండుకొనునట్లు వీలుగలుగజేయుము. తరువాత కుఱ్ఱవాని కనుబొమల మ