పుట:Manooshakti.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36

దేహావయవములను లోబరుచుకొన్నగదా, యితరుల దేహావయవములను లోబరచుకొనునది ? గాన నీవీయభ్యాసమును పూతిన్‌గజేయ నేర్చినతోడనే ప్రతివారిని నీవు వశముజేసికొన గలుగుదువు. ప్రతివారును నీకు వశ్యులైన నీకీలోకమున కష్టమెద్దియునుండదని కరతలామలక మేగద ?

ఇట్టియభ్యాసమువల్లనే గాలియందుగూడ నిరాధారముగ లేవగలవు. దానిని గురించి ముందు వ్రాయబోపు గ్రంథమునందు సులభమార్గములను కొన్నింటిని గనిపెట్టి ప్రచురింపబూనియుంటిని. గాన యట్టిగ్రంథమును వ్రాయటకు నాకు సావకాశమిచ్చెదరిని తలంచుచున్నా ను.

సోదరులారా ! నేనురచించిన విషయము లన్నియును నిశ్చయముగ జరుగునవియేగాని లేనిపోని బూటకములుగావని మీలో ప్రతివారును సిద్ధినిబొందినపిమ్మటనయినను తలంపక మానరు. నేనీగ్రంథమునందు జూపిన సాధనములలో కొన్ని మిక్కిలి సులభముగా నగును, మరికొన్ని కొంచెము ప్రయాసతో నగును. బూటకపు మాటల నోటికివచ్చిన నెల్లను మాటలేగదాయని ఆలాటీవారిలాభం బేపాటియు నెంచకుండగ చేటుదెచ్చు గ్రంథంబులు కోటివ్రాసి ప్రతిచోటుల మాటికి ప్రచురింపుచుండ పాటుజేసి గోన్నధనము మాటలతో గాజేయుట పాటియేను యనుచు నట్టి బూటకపుగ్రంధంబులు గొనినవా రెల్లప్పుడును ఘోషమిడుచుండుట ప్రతివారికిని సర్వసామాన్యముగ దెలిసియే యున్నది.