పుట:Manooshakti.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12

వాడైదారు కేకలవరకును పలుకకుండుట తటస్థించినది. పూర్వము మన ఋషులలో శపించిరన్న యేమనియర్ధమో గనుగొంటిరా! మనోశక్తిచే నేదియో యొకవిధంబుగ దూషించుట యని యర్థము. అట్లు మనోశక్తిచే నేమాటయన్నను తప్పక జరిగినట్లు పురాణములయంద నేకము లగుపడు చున్నవి. కావున మనోశక్తి కన్న రెండవది యెక్కువలేదని పలువిధముల ప్రతిమానవునకును తెలియవచ్చు చున్నది. శకుంతల దుష్యంతుని వివాహము జేసికొన్న సంగతినంతయును కణ్వమహర్షి తన మనోశక్తివలన గ్రహించియుండ లేదా!

ఒకనిని యొకపాము గరచెననుకొనుడు. అప్పుడీ మనోశక్తిని సంపాదించినవాడుండుట తటస్థించిన యెడల పాముకాటుచే కరువబడినవానిని సులభముగా బ్రతికింప గలవాడగును. ఎట్లన, “పామువిషము నీదేహమునందు బ్రవేశించినను నిన్నేమియుచేయ జాలదు". అని నీలో నీవాకరచిన చోటును జూచుచు గట్టిగా చనిపోవడను నమ్మకముతో నుండుము. కొంతసేపటి కాపాముచే కరువబడినవాడు లేచి యెప్పటివాని వలెనే యుండును. చూచితిరా మనోశ క్తివలన పాము విషముగూడ నేమియు చేయలేకయున్నది. కాబట్టి మిక్కిలి పట్టుదలతో నేదియైన నమ్మిచేసినచో నది కొనసాగునని నేను దృఢముగా చెప్పగలను. నెపోలియన్ అను మహాశయుడు మనోశ క్తి యనెడి యీమెస్మరిజమును బాగుగగుర్తెఱిగి యుండినకారణంబుస పెక్కద్భుత కార్యములను జేసినట్లు తెలియ వచ్చుచున్నది.