పుట:Manooshakti.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

11

బాగుగ మెస్మరిజమును నేర్చినవాడు తనమనోశక్తి వలన మిరపకాయను తీపిగా చేయుచుండుట మనమెల్లరమును చూచుచునే యున్నాముగదా! ఇది యంతయును చిత్తశక్తి (will Force) వల్లనే జరుగుచున్నది. సాధారణముగ నుత్సవ సమయములయందు మనలోని కొందరగ్నియందు దూకు చుండగ చూచుచున్నాము గదా! అట్లు నిప్పులోనికి దూకు మనుజునకు కాళ్ళుకాలకుండునా యని ప్రశ్నించిన, కాలకుండనే యున్నవని చెప్పుటకు సందియ మించుకయు లేదు. ఎందువల్ల ననిన నిప్పులోనికి దూకు సమయమునందు కాళ్ళు కాలవని దృఢచిత్తముతో దూకుచున్నాడు. గాన వాడిచ్చట మనోశక్తి నుపయోగించినాడు. తత్కారణమున వానికి నిప్పులవలస బాధ కొంచమైనను గలిగియుండ లేదు.

పూర్వము వాల్మీకులవారు తపస్సు చేయుచుండగా నాతనిమీద పుట్టలు, చెట్లు మొదలయినవి పుట్టినను యాతని కించుకయు దెలియకుండెను. యా మహాత్ముని మనశ్శక్తి నంతయును శ్రీమన్నారాయణుని యందుంచిన సమయమున చెదలు, చీమలు మొదలయినవి. కుట్టుచున్నను కొంచెమైన నొప్పిని బొందియుండలేదు. సాధారణముగా మనలో కొంత మందేదియో యొక విషయమును గురించి తమ మనోశక్తితో నాలోచించు చుండుట తటస్థించిన సమయమున నెవ్వరైన నట్టిసమయమున పిలిచినచో నైదారు కేకలవరకును పలుక కుండుట పలుమారు చూచియే యున్నాముగదా! వినుటకు చెపులున్నను మనస్సు వేరుగా పనిజేయుచున్న కారణమున