పుట:Manooshakti.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

13

పర్సనల్ మాగ్నెటిజమనియును, హిప్నాటిజమనియును, టెలిపతియనియును మొదలగునవనేక విధములపేర్లను బెట్టియున్నారుగాని యివన్నియును విచారింప నొకటిగనే గానుపించుచున్నవి. యీమనోశక్తివల్ల నితరులను లోబరుచుకొని మన కేది గావలయునో యది చేయించుకొనగలవార మగుదుము. అట్లు వాడు పనిజేయునప్పుడు తనంతటతాను జేయుచున్నాననుకొనునుగాని మనకు స్వాధీనమై మన మనోశక్తికి లొంగి చేయుచున్నానని యొకనాడును తలంచడు. యీపర్సనల్ మాగ్నెటిజము తెలిసియున్నచో యెవ్వడును మనలను స్వాధీనము చేసికొనలేడని యనుకొన్నను యట్టివాడు మనసమీపమునకు వచ్చినతోడనే వశ్యులగుదుము.

ఇట్టి మహత్తుగలిగిన మనోశక్తియొక్క రహస్యమును గ్రహించినవానికి ప్రపంచమునందేదియును కష్టముగానుండదు. యిట్టి మహత్తు గల్గిన మనోశక్తి వలన మిక్కిలివిచిత్రములయిన పనులను పెక్కింటినిజేసి జనులనెల్లరను సంతోషానంద భరితులనుగా చేయగలము. ప్రపంచమునందు నిత్యమును సంతోషముగ కాలము గడుపువానికన్న మిక్కిలి గొప్పవారొండొరులెవ్వరు? నిక్కముగ భూలోకమునందట్టి మహాశయున కదియొక స్వర్గభోగముగాక మరెయ్యది?

రూపాయిని నడిపించుట.

మనకు వెనుకభాగమున నెవ్వరిని లేకుండునట్లు నియమించి మనకనులకు సుమారిరువది యంగుళములకు లోపుగ