పుట:Mana-Jeevithalu.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

84

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

మృదువుగా గాని మరొకర్ని తప్పుపడతాం. మన నిస్పృహకి ఇతరులు కారకులని అంటాం. నా సుఖానికి గాని, నా హోదాకిగాని, గౌరవానికి గాని మీపైన ఆధారపడతాను కాబట్టి మీరు నాకు ముఖ్యం. అందుచేత మిమ్మల్ని జాగ్రత్తగా కనిపెట్టి ఉండాలి. మిమ్మల్ని సొంతం చేసుకోవాలి. మీ ద్వారా నానుంచి నేను పారిపోతాను. నా కాళ్లమీదికి నన్ను వెనక్కి తోసేసినప్పుడు నా సొంతస్థితికి నేనే భయపడటంతో, నేను కోపగించుకుంటాను. కోపం అనేక రూపాలు సంతరించుకుంటుంది. నిరాశ, కచ్ఛ, విరక్తి, ఈర్ష్య మొదలైనవి.

కోపాన్ని నిలువ చెయ్యటానికి, అంటే, కచ్ఛ కలిగి ఉండటానికి విరుగుడు క్షమించగలగటం. కానీ, కోపాన్నీ నిలువ చేసుకోవటం క్షమించగలగటం కన్న ముఖ్యమైనది. కోపం కూడబెట్టటమే లేనప్పుడు క్షమించగలిగి ఉండవలసిన అవసరమే ఉండదు. కచ్ఛ ఉన్నట్లయితే క్షమించగలిగి ఉండటం అవసరమవుతుంది. కాని, పొగడ్తకీ, గాయాన్నీ మనస్సులో పెట్టుకోవటానికీ లోనవకుండానూ, నిర్లక్ష్యంతో కరుడు కట్టకుండాను స్వేచ్ఛగా ఉండటంలో దయాదాక్షిణ్యాలుంటాయి. ఇచ్చా పూర్వకంగా కోపాన్ని వదిలించుకోలేం. ఎందుకంటే, ఇచ్ఛకూడా హానికరమైనదే. ఇచ్ఛ కోరికనుంచీ, ఏదో అవాలనే తాపత్రయం నుంచీ జనించినదే. ఇచ్ఛాపూర్వకంగా, బలవంతంగా కోపాన్ని అణచివేయటం అంటే, కోపాన్ని మరోస్థాయికి మార్చటం, దానికి మరోపేరు పెట్టటం, అంతే. అది అప్పటికీ హానికరమే. హానికరంగా లేకుండా ఉండటానికి - అంటే, ఆ విధంగా ఉండటానికి ప్రయత్నించాలని కాదు - కోరికని అర్థం చేసుకోవాలి. కోరిక స్థానంలో ఆధ్యాత్మికంగా మరొకటేమీ లేదు. దాన్ని అణచిపెట్టటం గాని, పవిత్రంగా చూడటంగాని సాధ్యంకాదు. కోరికని మౌనంగా, పక్షపాతం లేకుండా తెలుసుకోవటం జరగాలి. ఈ విధంగా నిర్లిప్తంగా తెలుసుకోవటంలో కోరిక అంటే ఏమిటో అనుభవం పొందటం జరుగుతుంది. అప్పుడు అనుభవించేవ్యక్తి దానికొక పేరు పెట్టటం జరగదు.

31. మానసిక రక్షణ

ఆయన ఆ విషయమై అన్ని విధాలా ఆలోచించానన్నాడు. ఆ విషయం