పుట:Mana-Jeevithalu.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కోపం

83

అంతమొందుతాయి. కోపానికి తాత్కాలికమైన బలం, ఒంటరిగా ఉండే వారిలో ఉండే జీవశక్తీ ఉంటాయి. కోపంలో ఒక విధమైన నిస్పృహ ఉంటుంది. ఒంటరితనమే నిస్పృహ కనుక. కోపం వల్ల నిరాశా, అసూయా, గాయపరచాలనే తపనా ఉధృతంగా వెలువడుతాయి. వీటివల్ల కలిగే సంతోషం మనల్ని మనం సమర్థించుకోవటం వల్లనే. ఇతరులను మనం నిందిస్తాం, అట్లా నిందించడంలోనే మనల్ని మనం సమర్థించుకోవడం ఉంది. ఏదో ఒక విధమైన ధోరణి లేకుండా - ఆత్మస్తుతి గాని, ఆత్మనిందగాని - మనం ఎలా ఉంటాం? మనల్ని మనం ఆకాశానికి ఎత్తుకోవటానికి అన్ని పద్ధతులూ అవలంభిస్తాం. మామూలు కోపం, హఠాత్తుగా ఎగిరిపడటం, మళ్లీ దాన్ని త్వరలో మరచిపోవటం - అది ఒకటి. కాని, ప్రయత్నపూర్వకంగా పెంచుకున్న కోపం, ఎంతోకాలం నిలవుంచి, గాయపరచటానికీ, నాశనం చెయ్యటానికీ ఎదురు చూస్తూండటం మరొక విషయం. మామూలు కోపాన్ని ఏదైనా శారీరక కారణం వల్ల వచ్చి ఉంటే దాన్ని కనిపెట్టి, దాన్ని పోగొట్టవచ్చు. కాని, మానసిక కారణం వల్ల వచ్చిన కోపం చాలా సూక్ష్మమైనదీ, క్లిష్టమైనదీ - వ్యవహరించటానికి. మనలో చాలా మందిమి కోపం వచ్చినా పరవాలేదనుకుంటాం. దానికి వెంటనే కారణాన్ని వెతికి చూపిస్తాం. మనకి గాని, ఇతరులెవరికైనా గాని అన్యాయం జరిగినప్పుడు మనం ఎందుకు కోపగించుకోకూడదు? అందువల్ల మనం సహేతుకంగా కోపగించుకుంటాం. ఊరికే కోపం వచ్చిందని చెప్పి, అంతటితో ఎప్పుడూ ఊరుకోం. దానికి గల కారణాన్ని విపులంగా విశదీకరిస్తాం. మనం అసూయపడుతున్నామనీ, మనకి విరక్తి కలిగిందనీ ఊరికే చెప్పి ఊరుకోం. దాన్ని సమర్థించి విశదీకరిస్తాం. అసూయ లేకుండా ప్రేమ ఎలా ఉంటుందని కూడా అడుగుతాం, లేదా, ఎవరి ప్రవర్తనో మనకి నిరాశ కలిగించిందనో ఏదో చెబుతాం.

ఈ విశదీకరించటం, మాటల్లో వ్యక్తపరచటం, మౌనంగా గాని, పైకి చెప్పి గాని - ఇవే కోపాన్ని నిలవుండేటట్లు చేస్తాయి. అది పెరిగేటట్లూ, లోతుకి పోయేటట్లూ చేస్తాయి. అ విశదీకరణ - మౌనంగా గాని, మాట్లాడుతూగాని - మనల్ని మనం కనిపెట్టకుండా 'డాలు'లా అడ్డుపెడుతుంది. మనల్ని మెచ్చుకోవాలనో, పొగడాలనో ఏదో ఆశిస్తాం. ఇది సంభవించనప్పుడు మనం నిరాశ చెందుతాం. మనకి నిస్పృహ, ఈర్ష్యా కలుగుతాయి. అప్పుడు ఆగ్రహంతోగాని,