పుట:Mana-Jeevithalu.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

46

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

మీతోకాదు, నాలోనాకే. ఈ సమైక్యతని మనస్సు ఎట్టి సమయంలోనూ సాధించలేదు. మనస్సు పూర్తిగా, ప్రశాంతంగా ఉన్నప్పుడే, దానంతట అది అంతమైపోయినప్పుడే సమైక్యత సిద్ధిస్తుంది. అటువంటప్పుడే సంబంధ బాంధవ్యంలో బాధ అనేది ఉండదు.

18. తెలిసినది, తెలియనిది


నిశ్చలమైన నీటిమీద సాయంకాలపు నీడలు పొడుగ్గా పడుతున్నాయి. పగలు పూర్తి అవుతున్న కొద్దీ నది ప్రశాంతగా అవుతోంది. చేపలు నీళ్లలోంచి పైకి గెంతుతున్నాయి. పెద్ద పెద్ద పక్షులు చెట్లలో తలదాచుకోవటానికి వస్తున్నాయి. ఆకాశంలో ఒక్క మేఘం కూడా లేదు. నీలంగా మెరుస్తోంది ఆకాశం. మనుషులతో నిండిన పడవ ఒకటి నది మీంచి వస్తోంది. చప్పట్లు కొడుతూ పాడుతున్నారు పడవలో వాళ్లు. కొంచెం దూరంలో ఆవు ఒకటి అరుస్తోంది. సాయంకాలపు సుగంధం పరివ్యాప్తమై ఉంది. బంతి పువ్వుల దండ ఒకటి నీళ్లతో బాటు కొట్టుకుపోతోంది, సూర్యాస్తమయంలో మెరుస్తూ. అంతా ఎంత అందంగా సజీవంగా ఉంది - అ నదీ, ఆ పక్షులూ, ఆ వృక్షాలూ, అ పల్లెవాళ్లూ.

నదికి ఎదురుగా మేము ఒక చెట్టు క్రింద కూర్చున్నాం. ఆ చెట్టుకి దగ్గరలోనే ఒక చిన్న గుడి ఉంది. బక్క చిక్కిన ఆవులు కొన్ని ఆ చుట్టుపక్కల తిరుగుతున్నాయి. ఆ గుడి ఎంతో శుభ్రంగా బాగా తుడిచి ఉంది. పూలపొదలు నీళ్లు పోసి బాగా పెంచినట్లున్నాయి. ఒకాయన సంధ్యావందనం చేస్తున్నాడు. ఆయన కంఠంలో సహనం, విషాదం ఉన్నాయి. సూర్యుని అంతిమ కిరణాల కాంతితో అప్పుడే వికసించిన పూలరంగులో ఉన్నాయి నీళ్లు. అంతలో ఎవరో ఒకాయన వచ్చి, మాతో బాటు కూర్చుని, తన అనుభవాల గురించి చెప్పటం మొదలుపెట్టారు. తన జీవితంలో ఎన్నో సంవత్సరాలు దైవాన్ని అన్వేషించటంలోనే గడిచాయన్నాడు. ఎన్నో నిరాడంబర మార్గాలను అనుసరించాడుట. ఎన్నో ప్రీతికరమైన వాటిని త్యజించాడుట. సంఘ సేవలో ఎంతో తోడ్పడ్డాడుట - పాఠశాల నిర్మించటం, మొదలైన వాటిలో ఆయనకి