పుట:Mana-Jeevithalu.pdf/56

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
47
తెలిసినది, తెలియనిది

ఎన్నో విషయాల్లో ఆసక్తి ఉన్నదిట. కాని, దైవాన్ని కన్నుక్కోవాలనే ఆసక్తే ఆయన్ని దహించి వేస్తున్నదిట. ఇన్నేళ్లకి, ఇప్పుడు అ దైవాన్ని వినగలుగుతున్నాడుట. చిన్న చిన్న విషయాల్లోనూ, పెద్ద విషయాల్లోనూ కూడా మార్గదర్శక మవుతున్నదిట. తన సొంత ఉద్దేశమంటూ ఏదీ లేదుట. అంతా ఆ అంతర్వాణి చెప్పినట్లుగానే నడుచుకుంటున్నాడుట. అది ఎప్పుడూ ఆయన్ని భంగపరచలేదుట, అప్పుడప్పుడు దాన్ని స్పష్టంగా, సరిగ్గా గ్రహించలేక పోయినప్పటికీ ఆయన ప్రార్థన అంతా ఈ కాయాన్ని పవిత్రం చేసుకోవటం కోసం, అ దైవానుగ్రహానికి పాత్రం కావటం కోసమేనట.

అపరిమితమైనటువంటి దాన్ని మీరూ నేనూ కనుక్కోగలమా? కాలంతో ప్రమేయం లేనట్టి దాన్ని, కాలంతో రూపొందినట్టిదాని సహాయంతో అన్వేషించగలమా? ఎంతో కష్టపడి శ్రద్ధగా సాధన చేసిన శిక్షణ అపరిచితమైనట్టి దానికి దారి చూపుతుందా? ఆది కాని అంతంకాని లేనట్టి దానికి ఒక మార్గమంటూ ఉంటుందా? అటువంటి సత్యాన్ని మన కోరికల వలలో పట్టుకోగలమా? మనం ఏది పట్టుకోగలిగినా, అది తెలిసినదాని ప్రతిరూపం మాత్రమే. నామకరణం చేయబడినది అనామిక కాలేదు. నామకరణం చేయటం అంటే నిద్రాణంగా ఉన్న ప్రతిక్రియలను మేలుకొల్పటం మాత్రమే. ఈ ప్రతిక్రియలు ఎంత ఉన్నతమైనవైనా, ఎంత సంతోషకరమైనవైనా, నిజమైనవి కాదు. ఏదైనా ఉత్తేజం కలిగిస్తే మనలో ప్రతిక్రియ ఏర్పడుతుంది. సత్యం ఎటువంటి ఉత్తేజాన్నీ కలిగించదు. అది ఉంటుంది. అంతే.

మనస్సు తెలిసినదాన్నుంచి తెలిసినదానికి కదులుతూ ఉంటుంది. మీకు తెలియని దాన్ని గురించి మీరు ఆలోచించలేరు. అది అసంభవం. మీరు ఆలోచించేదంతా తెలిసిన దాన్నుంచే వస్తుంది, గతం నుంచి, ఆ గతం ఏనాటిదో కావచ్చు, ఒక్క క్షణం క్రిందటిదయినా కావచ్చు. ఈ గతం కూడా ఆలోచనే. అనేక ఆకృతుల్లో, ఎన్నో ప్రభావాలకులోనై, పరిస్థితులకూ, ఒత్తిడికీ లోనవుతూ తన్ను తాను మార్చుకుంటూ, ఎప్పటికీ గత ప్రక్రియగానే మిగిలి పోతుంది. ఆలోచన దేన్నైనా కాదనగలదు, అవునన గలదు, అంతే. దేన్నీ కనుగొనటంగాని, కొత్త దాన్ని వెతకటంగాని చెయ్యలేదు. ఏ కొత్త విషయాన్ని