పుట:Mana-Jeevithalu.pdf/54

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
45
సంబంధ బాంధవ్యాల్లో ప్రేమ

కాలబద్ధమయే తత్వం గల మనస్సు అనంతమైన ప్రేమను అందుకోగలదా?

హృదయంలోని ప్రేమ కూడా కొన్ని తమాషాలు చేస్తుంది. ఎందుచేతనంటే, మనం మన హృదయాలను సంశయాత్మకంగా, సందిగ్ధమయంగా అయేటంతగా పాడుచేశాం. దీని వల్లనే జీవితం అంత బాధాకరంగానూ కష్టదాయకంగానూ అవుతోంది. ఒక క్షణంలో మనలో ప్రేమ ఉంటుంది, మరుక్షణం పోతుంది. మానసికం కానిది - ఎక్కణ్ణించి వచ్చిందో తెలుసుకోలేని ఒక ఊహాతీత మయిన శక్తి ఉద్భవిస్తుంది. ఆ శక్తిని మనస్సు నాశనం చేస్తుంది. ఆ రెండింటికీ జరిగే యుద్ధంలో మనస్సే ప్రతిసారి విజేత. మనలో జరిగే ఈ సంఘర్షణకి పరిష్కారం మనసు తన చాతుర్యంతో సాధించేది కాదు. సంకోచించే హృదయం సాధించేది కాదు. ఈ సంఘర్షణని అంత చేసేందుకు మార్గమంటూ ఏదీ లేదు. ఒక మార్గాన్ని కనిపెట్టాలనుకోవటం కూడా, మనస్సు తన ఆధిక్యాన్ని చూపించుకోవాలనీ, సంఘర్షణని తప్పించుకుని శాంతంగా ఉండాలనీ, ప్రేమని పొందాలనీ, ఇంకేదో అవాలనీ తపించటమే.

మనస్సు కోరదగిన ప్రేమ అనే లక్ష్యంగా, ప్రేమించటానికి ఎటువంటి మార్గమూ లేదని అన్ని విధాలా తెలుసుకోవటమే మన ముఖ్య సమస్య. ఈ విషయాన్ని మనం నిజంగా ప్రగాఢంగా అర్ధం చేసుకున్నట్లయితే, ఈ లోకానికి అతీతమైనదేదో అందుకోవటానికి ఆస్కారం ఉంటుంది. అటువంటి దానితో సంపర్కం లేనంతవరకూ మనం ఏం తల పెట్టినా సంబంధ బాంధవ్యాల్లో ఏనాటికీ ఆనందం లభించదు. మీకు ఆ వరం లభించి, నాకు లభించినట్లయితే, మీకూ నాకు మధ్య సంఘర్షణ రావచ్చు. మీకు సంఘర్షణ లేకపోవచ్చు. నాకు ఉంటుంది. నా బాధలో, నా దుఃఖంలో నాకై నేను తెగతెంపులు చేసుకుంటాను. దుఃఖం కూడా సంతోషం లాగే ప్రత్యేకత నిస్తుంది. స్వయం సిద్ధంకాని ప్రేమ ఉండనంత కాలం సంబంధ బాంధవ్యాలు బాధాకరంగా ఉంటాయి.

ఆ ప్రేమ వరం కనుక పొందినట్లయితే నేనెలాంటి వాడినైనా నన్ను మీరు ప్రేమించక మానరు. అప్పుడు నా ప్రవర్తన బట్టి మీ ప్రేమకు రూపాన్నివ్వరు. అప్పుడు మనస్సు ఎన్ని వేషాలు వేసినా, మీరూ నేనూ వేరైనా, ఏవో కొద్ది విషయాల్లో మాత్రమే మీకు నాకూ కలిసినా, సమైక్యత ఏర్పడేది