పుట:Mana-Jeevithalu.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నిద్ర

41

కొనసాగుతుంది. మందకొడిగానో, ఉత్సాహభరితంగానో, రుచీపచీలేని అర్థరహితమైన పోరాటం మరోస్థాయిలో విస్తృతమవుతుంది. నిద్ర వల్ల శరీరంలో పునరుత్తేజం కలుగుతుంది. దాని బ్రతుకు అది బ్రతికే లోపలి జీవికి పునరుద్ధరణం కలుగుతుంది. నిద్రలో కోరికలు నిద్రాణంగా ఉంటాయి. అందువల్ల జీవికి అడ్డంరావు. శరీరం పునర్వికాసం పొందిన మీదట కోరిక తన చర్యల్ని ఉత్సాహంతో విస్తృతం చేసుకోవటానికి మరింత అవకాశం కలుగుతుంది. లోపలి జీవి విషయంలో ఎంత తక్కువగా కలుగజేసుకుంటే అంత మంచిది నిజానికి. ఆ జీవి విషయమై మనస్సు ఎంత తక్కువగా వ్యవహరిస్తే దాని పనులు అంత ఆరోగ్యకరంగా, అంత సహజంగా ఉంటాయి. ఆ జీవికి జబ్బులు రావటం అన్నది వేరే విషయం - మనస్సు వల్ల వచ్చినవి గాని, దాని స్వీయ బలహీనత వల్ల వచ్చినవి గాని.

నిద్రకి ఎంతో అర్థం ఉంది. కోరికలు శక్తిమంత మవుతున్న కొద్దీ నిద్రకి అర్థం పోతుంది. కోరికలు పైకి కనిపించేవి అయినా, కనిపించనివి అయినా అన్నీ ప్రధానంగా పైన ఉండేవే. నిద్రా సమయంలో ఇవి పైకి కనిపించకుండా ఉంటాయి. తాత్కాలికంగా. నిద్ర కోరికకి వ్యతిరేకమైనది కాదు. నిద్ర అంటే ఏమీ లేకపోవటం అని కాదు - కోరిక చొరరాని స్థితి అని మాత్రమే. చైతన్యపు పై పొరలు స్తిమిత పడటం జరుగుతుంది నిద్రలో. అందుచేత అవి లోలోపలి పొరలు అందించే సమాచారాన్ని గ్రహించగలుగుతాయి. కాని ఇది సమస్య మొత్తంలో కొద్ది భాగాన్ని అర్థం చేసుకున్నట్లవుతుంది. చైతన్యపు పొరలన్నీ ఒక దాన్నొకటి, పని పాటలు చేసుకుంటున్న సమయంలోనూ, నిద్రపోతున్నప్పుడూ కూడా తెలుసుకోవటం నిస్సంశయంగా సాధ్యమవుతుంది. ఇది అవసరం కూడా. ఈ విధంగా తెలుసుకోవటం వల్ల మనస్సు తనకు తాను ఆపాదించుకున్న స్వీయ ప్రాముఖ్యం నుంచి స్వేచ్ఛ లభిస్తుంది. అందువల్ల ఇక మనస్సు ఆధిక్యం ఉన్న అంశంగా ఉండదు. ఆ విధంగా మనస్సు తన స్వార్ధ పూరితమైన ప్రయత్నాలనూ, చర్యలనూ స్వేచ్ఛగా, సహజంగా వదులు కుంటుంది. ఈ ప్రక్రియలో ఏదో అవాలనే వాంఛ పూర్తిగా కరిగిపోతుంది. కూడబెట్టాలనే తొందర ఇక ఉండనే ఉండదు.

నిద్రలో జరిగేదింకా కొంత ఉంది. మన సమస్యలికి పరిష్కారం