పుట:Mana-Jeevithalu.pdf/51

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
42
మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

దొరుకుతుంది అందులో చైతన్యంతో ఉండే మనస్సు నెమ్మదిగా ఉన్నప్పుడు పరిష్కారాన్ని గ్రహించటానికి వీలవుతుంది. ఇది సులభమే. అంతకన్న అర్థవంతమైనదీ, ముఖ్యమైనదీ ఏమిటంటే, అది పునరుద్ధారణం. అది అలవరుచుకునేది కాదు. ఒక సహజ నైపుణ్యాన్నిగాని, సామర్థ్యాన్నిగాని, సాంకేతిక నైపుణ్యాన్నిగాని, ఒక కార్యకలాపాన్నిగాని ప్రవర్తననిగాని ప్రయత్నపూర్వకంగా అలవరచుకోగలరు ఎవరైనా. కాని, ఇది పునరుద్ధారణం కాదు. అలవరచుకోవటం అంటే సృజించటం కాదు. ఏదో అవాలనుకుని ఏదైనా ప్రయత్నించినట్లయితే, ఈ సృజనాత్మక పునరుద్ధారణం సాధ్యమవదు. మనస్సు తనంతట తాను కూడబెట్టాలనే కోరికని వదులుకోవాలి. ఒక అనుభవం ద్వారా మరికొంత అనుభవాన్నీ, విజయాన్నీ సాధించటం కోసం కూడబెట్టటం పోవాలి. ఈ కూడ బెట్టాలనే తపన, స్వీయ రక్షణ చేసుకోవాలనే తపన కాలగతిని పెంపొందిస్తూ, సృజనాత్మక పునరుద్ధారణం కాకుండా చేస్తుంది.

చైతన్యావస్థకి కాలంతో సంబంధం ఉన్నదని మనకి తెలుసును. జరిగిన దాన్ని సుస్థిరం చేసుకోవటం, అనుభవాన్ని దాచుకోవటం - వివిధ స్థాయిల్లో జరిగే ప్రక్రియ అది. చైతన్యావస్థలో ఏం జరిగినా అది దాని ప్రతిరూపం మాత్రమే. దాని లక్షణం దానిది. అది పరిమితమైనది. నిద్ర పోతున్నప్పుడు ఈ చైతన్యావస్థ శక్తిమంతం అవుతుంది. లేదా, పూర్తిగా విరుద్ధంగానైనా జరుగవచ్చు. నిద్ర మనలో అనేక మందికి వారి అనుభవాలను శక్తిమంతం చేస్తుంది. అనుభవాన్ని ముద్రించుకుంటుంది, దాచుకుంటుంది. అయితే, అది విస్తృతమవటమేగాని పునరుద్ధారణం కాదు. విస్తృతమైనప్పుడు ఒకవిధమైన ఉత్తేజం కలుగుతుంది. విజయప్రదంగా ఉంటుంది. అర్థమైనట్లూ, ఇంకా అనేక రకాలుగా ఉంటుంది. కాని అదంతా సృజనాత్మక పునరుద్ధారణం కాదు. ఏదో అవాలనుకునే ప్రక్రియ పూర్తిగా అంతం కావాలి, మరికొంత అనుభవానికి దారితీయటం ద్వారా కాదు. అది అంతం అవటం కోసం మాత్రమే.

నిద్రలోనూ, తరుచు పని చేసుకునే సమయంలోనూ, ఏదో అవాలను కోవటం పూర్తిగా ఆగిపోయినప్పూడూ, కారణం, దాని ఫలితం అంత మొంది