పుట:Mana-Jeevithalu.pdf/315

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

306

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

జ్ఞాపకం, అంటే అదీ ప్రతిక్రియే కదా. ప్రతిక్రియని, అంటే అనుభూతిని తృప్తిపరచటానికి సాధ్యం కాదు. ప్రతిక్రియ ఎప్పుడూ తృప్తిగా ఉండదు. ప్రతిక్రియ ఎప్పుడూ లేని స్థితిలోనే ఉంటుంది. లేనిది ఎన్నటికీ ఉండలేదు. అనుభూతికి తృప్తి అనేది తెలియదు. అనుభూతీ, ప్రతిక్రియా ఎప్పుడూ సంఘర్షణని పెంపొందిస్తాయి. సంఘర్షణే మరింత అనుభూతి అవుతుంది. గందరగోళం గందరగోళాన్ని పుట్టిస్తుంది. మనస్సు యొక్క కార్యకలాపం, దానియొక్క అన్ని రకాల స్థాయిల్లోనూ, అనుభూతిని పెంపొందింపజేయటమే. దాని పెరుగుదలకి ఆటంకం కలిగినప్పుడు వైరుధ్యంలోనే తృప్తి పొందుతుంది. అనుభూతీ, ప్రతిక్రియా - రెండు విరుద్ధమైన వాటి మధ్య జరిగే సంఘర్షణ. ప్రతిఘటనా, స్వీకారం, లొంగిపోవటం, తిరస్కరించటం - వీటి సంఘర్షణలో సంతృప్తి ఉంది, ఆ సంతృప్తి మరింత సంతృప్తి కోసం నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటుంది.

మనస్సు ఆనందాన్ని కనుక్కోలేదు. ఆనందం అనుభూతి లాగ వెతికితే దొరికేది కాదు. అనుభూతి మళ్లీ మళ్లీ దొరుకుతుంది, ఎందుకంటే, అది ఎప్పుడూ పోతూనే ఉంటుంది. కాని ఆనందం దొరకటం సాధ్యంకాదు. జ్ఞాపకం ఉన్న ఆనందం అనుభూతి మాత్రమే - ప్రస్తుతాన్ని సమర్ధిస్తూగాని, వ్యతిరేకిస్తూగాని కలిగే ప్రతిక్రియ. జరిగిపోయినది ఆనందం కాదు. అంతమైన ఆనందానుభవం అనుభూతి, ఎందువల్లనంటే, జ్ఞాపకం అంటే గతం, గతం అంటే అనుభూతి కనుక. ఆనందం అనుభూతి కాదు.

మీరెప్పుడైనా ఆనందంగా ఉనట్లు తెలుసునా?

"కచ్చితంగా తెలుసును, దేవుడి దయవల్ల. లేకపోతే, ఆనందంగా ఉండటం నాకు తెలిసేదే కాదు."

మీకు తెలిసినదీ, మీరు ఆనందం అంటున్నదీ అనుభవం యొక్క అనుభూతి మాత్రమే నిశ్చయంగా. అది ఆనందం కాదు. మీకు తెలిసినది గతం. ప్రస్తుతం కాదు. గతం అంటే అనుభూతి, ప్రతిక్రియ, జ్ఞాపకం. మీరు ఆనందంగా ఉన్నట్లు మీకు జ్ఞాపకం. అయితే; ఆనందం అంటే ఏమిటో మీరు చెప్పగలరా? మీరు గుర్తుకి తెచ్చుకోగలరు. కాని, అది కాలేదు. గుర్తింపు