పుట:Mana-Jeevithalu.pdf/316

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
307
అనుభూతి, ఆనందం

ఆనందం కాదు. ఆనందం గురించి తెలియటం ఆనందం కాదు. గుర్తింపు జ్ఞాపకం యొక్క ప్రతిక్రియ. అనేక జ్ఞాపకాలూ, అనుభవాలూ కలగాపులగం అయిన మనస్సు ఎప్పటికైనా ఆనందంగా ఉండగలదా? అనుభవించటానికి గుర్తింపే ఆటంకమవుతుంది.

మీరు ఆనందంగా ఉన్నారని మీరు తెలుసుకున్నప్పుడు ఆనందం ఉంటుందా? ఆనందం ఉన్నప్పుడు మీకు తెలుస్తుందా? సంఘర్షణతోనే చైతన్యం వస్తుంది, ఇంకా కావాలనే గుర్తింపులోని సంఘర్షణతో. ఇంకా కావాలనే గుర్తింపు కాదు ఆనందం. సంఘర్షణ ఉన్న చోట ఆనందం ఉండదు. మనస్సు ఉన్నచోట సంఘర్షణ ఉంటుంది. ఆలోచన అన్ని స్థాయిల్లోనూ జ్ఞాపకం యొక్క ప్రతిక్రియే. అందుచేత ఆలోచన తప్పనిసరిగా సంఘర్షణని పెంపొందిస్తుంది. ఆలోచన అంటే అనుభూతి. అనుభూతి ఆనందం కాదు. అనుభూతులు ఎప్పుడూ తృప్తికోసం ప్రయత్నిస్తాయి, లక్ష్యం అనుభూతి. కాని ఆనందం లక్ష్యం కాదు. దాన్ని వెతికి పట్టుకోవటానికి కుదరదు.

"అయితే, అనుభూతులు ఎలా అంతమవుతాయి?"

అనుభూతిని అంతం చేయటమంటే మరణాన్ని ఆహ్వానించటమే. కోరికలను అణచిపెట్టటం మరొక అనుభూతి. కోరికలను అణచిపెట్టటం వల్ల శారీరకంగా గాని, మానసికంగా గాని సున్నితత్వాన్ని నాశనం చేయటం అవుతుంది కాని అనుభూతి కాదు. తన్ను తాను అణగద్రొక్కుకునే ఆలోచన మరింత అనుభూతిని కోరుతుందంతే - ఆలోచనే అనుభూతి కనుక. అనుభూతి అనుభూతిని అంతం చెయ్యలేదు. ఇతర స్థాయిల్లో వేరే అనుభూతులు ఉండవచ్చు. అంతేకాని అనుభూతికి అంతమనేది ఉండదు. అనుభూతిని నాశనం చెయ్యటమంటే సున్నితత్వం లేకుండా ఉండటం, మరణించటం, చూడకుండా ఉండటం, వాసన పీల్చకుండా ఉండటం, స్మరించకుండా ఉండటం, అంటే, వేరుగా ఉండటం. మన సమస్య పూర్తిగా వేరు, కాదా? ఆలోచన ఎన్నటికీ ఆనందాన్ని తీసుకురాలేదు. అది అనుభూతుల్ని జ్ఞాపకం తెచ్చుకోగలదు. ఎందుకంటే ఆలోచన అనుభూతి కనుక. అది ఆనందాన్ని పెంచలేదు, సృష్టించలేదు. దాన్ని క్రమంగా చేరుకోలేదు. ఆలోచన దానికి తెలిసిన దానివైపుకి పోగలదు. కాని ఆనందం