పుట:Mana-Jeevithalu.pdf/299

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

290

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

ముఖ్య ఆసక్తి ఉన్నప్పుడు పరధ్యానమే ఉండదు. మనస్సు ఒకదాని నుంచి మరొక దానికి తిరుగుతూ ఉండటం పరధ్యానం కాదు - ఉన్న స్థితిని తప్పించుకోవటం. సమస్య అతి సమీపంలో ఉన్నప్పుడు మనం దాన్ని వదిలి ఇక్కడికీ అక్కడికీ తిరగాలనుకుంటాం. ఈ తిరగటం వల్ల మనం ఏదో ఒకటి చేసేందుకు దొరకుతుంది - వ్యాకులపడటం, వృథాగా కబుర్లు చెప్పటం వంటివి. తిరుగుతూ ఉండటం తరుచు బాధాకరం అనిపించినా దాన్నే నయమనుకుంటాం ఉన్నస్థితి కన్న.

దీన్ని గురించి మీరు తీవ్రంగా పరిశీలించాలనుకుంటున్నారా, లేక ఊరికే దానిచుట్టూ ఆటలాడుతున్నారా?

"నిజంగా దాన్ని పూర్తిగా చివరంటా తెలుసుకోవాలని ఉంది నాకు. అందుకే వచ్చాను."

మీరెందుకు ఆనందంగా లేరంటే, నూతిని నింపే జల లేదని,అందుకనేనా? గులకరాళ్లమీద నీటి గుసగుసల్ని మీరెప్పుడో ఓసారి విని ఉంటారు. కాని ఇప్పుడు నదిపాయి ఎండిపోయింది. మీరు ఆనందాన్ని ఎరుగుదురు. కాని అది ఎప్పుడూ వెనక్కి వెళ్ళిపోయేదే. అది ఎప్పుడూ గతానికి చెందినదే. ఆ జలనేనా మీరు వెతుకుతున్నది. దాన్ని మీరు వెతకాలా? లేక దానంతట అది అనుకోకుండా ఎదురవాలా? అది ఎక్కడుందో తెలిస్తే మీరు దాన్ని పొందే సాధనాలు కనుక్కుంటారు. కాని, తెలియదు కాబట్టి దానికి మార్గంలేదు. తెలిసి ఉండటం అంటే జరిగే దాన్ని ఆపటమే. ఉన్న సమస్యల్లో అదొకటా?

"నిశ్చయంగా అదే జీవితం ఎంత మందకొడిగా క్రియావిహీనంగా ఉందంటే, అది కనక జరిగితే ఇంకేదీ అడగటం జరగదు."

ఒంటరితనం సమస్యగా ఉందా?

"ఒంటరిగా ఉండటానికి నాకభ్యంతరం లేదు. దాంతో ఎలా వ్యవహరించాలో నాకు తెలుసు. వాహ్యాళికైనా వెడతాను, లేదా, ఒంటరితనం పోయేవరకూ నిశ్శబ్దంగా కూర్చుంటాను, అంతేగాక, నాకు ఏకాంతంగా ఉండటం ఇష్టం."