పుట:Mana-Jeevithalu.pdf/298

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పరధ్యానం

289

తాత్కాలికంగా కొంత ఆనందం ఆవిడకి కలగకపోలేదుట. కాని అదంతా గతంలో. ఇప్పుడు ఆవిడ వెతుకుతున్నది జీవితానికి అర్థాన్నిచ్చేదేదైనా ఉన్నదేమోననిట. ఆవిడ ఎన్నిటినో ప్రయత్నించి చూసిందిట. ఆ సమయానికి అవి లాభదాయకంగా కనిపించాయిట. ఎన్నో ముఖ్య సాంఘిక కార్యకలాపాల్లో పాల్గొన్నదిట. మత సంబంధమైన విషయాల్లో మనస్ఫూర్తిగా నమ్మిందిట. కుటుంబంలో వారి మరణం కూడా అనుభవమైందిట. ఆవిడకి పెద్ద ఆపరేషను ఒకటి జరిగిందిట. మొత్తం మీద జీవితం సులభంగా గడపలేదని చెప్పింది. తన వంటివాళ్లు ప్రపంచంలో కోటానుకోట్లు ఉండవచ్చునంది. తెలివితక్కువైనా, అవసరమైనదైనా, ఈ గొడవంతటికీ అతీతంగా నిజంగా చేయదగిన మంచిది ఏదైనా ఉన్నదేమో కనుక్కోవాలని కోరుతోంది.

మంచివి వెతికితే దొరకవు. వాటిని కన్నుక్కోవటం కుదరదు. అవి జరగాలి. జరిగేటట్లు గడుసుగా పథకం వెయ్యటానికి కుదరదు. తీవ్ర ప్రాముఖ్యం కలదేదైనా సరే - జరుగుతుంది గాని ఎన్నటికీ సృష్టింపబడదన్న విషయం నిజం కాదా? జరగటం ముఖ్యం. కనుక్కోవటం కాదు. కనుక్కోవటం అంతకన్న సులభమే కాని జరగటం అనేది వేరే విషయం. అది కష్టమైనది కాదు. వెతకాలనీ, కనుక్కోవాలనీ తపించటం పూర్తిగా ఆగిపోవాలి - ఏదైనా జరగాలంటే. దొరకటంలో పోగొట్టుకునే అర్థం కూడా ఉంటుంది. పోయేందుకు మీ దగ్గర ఉండాలి. సొంతం చేసుకోవటం వల్లగాని, సొంతం కావటం వల్లగాని, అవగాహన అవటానికి స్వేచ్ఛ ఉండదు.

కాని, ఈ ఆందోళన, అస్తిమితం ఎప్పుడూ ఎందుకుంటోంది? దాని గురించి తీవ్రంగా పరిశీలించారా ఇంతకు ముందు?

"ఏదో యథాలాపంగా ప్రయత్నించానంతే. ప్రయోజనకరంగా కాదు. ఎప్పుడూ పరధ్యానంలో పడుతూ ఉండేదాన్ని."

పరధ్యానంలో పడటం కాదు నిజం చెప్పాలంటే. అది మీకు ఎప్పుడూ ప్రధానమైన సమస్య అనిపించలేదంతే. ప్రధానమైన సమస్య ఉన్నప్పుడు పరధ్యానం ఉండదు. పరధ్యానం అనేది లేదు. పరధ్యానం అంటే ఒక ముఖ్య ఆసక్తి నుంచి మనస్సు ఇటూ అటూ తిరగటం అని అర్థ వస్తుంది. కాని