పుట:Mana-Jeevithalu.pdf/282

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వృద్ధిలోకి రావాలనే ఆకాంక్ష

273

కొద్దిరోజుల క్రితం బాగా ఎక్కువగా వాన కురిసింది. మట్టి మెత్తగా దిగబడుతోంది. లేత బంగాళాదుంపల పంటలున్నాయి. లోయకి బాగా దిగువున ఊరు ఉంది. ఆ సువర్ణోదయం అందంగా ఉంది. కొండ దాటిన తరవాత మళ్లీ ఇంటికి వెళ్లే త్రోవ ఉంది.

ఆవిడ చాలా తెలివైనది. కొత్తగా వచ్చిన పుస్తకాలన్నీ చదువుతుందిట. కొత్తగా వేసిన నాటకాలన్నీ చూస్తుందిట. ఈ మధ్య బాగా వెర్రెక్కించిన ఏదో వేదాంతం గురించి చాలా వివరాలు తెలుసుకుందిట. ఆవిడ మానసికంగా పరిశీలింపబడిందిట. మనస్తత్వ శాస్త్రం గురించి బాగా చదివినట్లే తోస్తోంది - ఆవిడ ఉపయోగించే ప్రత్యేక శబ్దాలను బట్టి. ప్రముఖ వ్యక్తులందరినీ తప్పకుండా కలుసుకుంటుందిట. ఎవరినో యథాలాపంగా కలుసుకున్నప్పుడు వారు ఆవిణ్ణి ఇక్కడికి తీసుకొచ్చారుట. సునాయాసంగా మాట్లాడుతుందావిడ. హుందాగానూ, ఆకట్టుకునేట్లూ మాట్లాడుతుంది. వివాహం అయిందావిడకి. కాని పిల్లల్లేరు. అదంతా వెనకటి విషయం అన్నట్లుగా ఉంది. ఇప్పుడు ఆవిడ ప్రయాణం వేరు. బాగా డబ్బున్నావిడే అయి ఉండవచ్చు, ఆవిడ దగ్గర కూడా ఆ ధనవంతుల దగ్గర ఉండే చిత్రమైన ధోరణి ఉంది. ఆవిడ మొదలుపెట్టటమే "ప్రస్తుత క్లిష్టపరిస్థితిలో మీరే విధంగా ప్రపంచానికి సహాయపడుతున్నారు" అనే ప్రశ్నతో మొదలుపెట్టింది. ఆవిడ అలవాటుగా వేసే ప్రశ్నలో అదొకటి కావచ్చు. ఇంకా ఎన్నో ఆత్రుతగా అడిగింది - యుద్ధాన్ని నిరోధించటం గురించీ, కమ్యూనిజం వల్ల కలిగే ఫలితాల గురించీ, మానవుని భవిష్యత్తు గురించీ.

యుద్ధాలూ, అధికమవుతూన్న దుర్ఘటనలూ, దుఃఖాలూ, అన్నీ నిత్య జీవితంలోనుంచి వచ్చినవే కాదా? ఈ క్లిష్ట పరిస్థితికి మనలోని ప్రతి ఒక్కరూ బాధ్యులు కారా? భవిష్యత్తు ప్రస్తుతంలోనే ఉంది. ప్రస్తుతాన్ని అర్థం చేసుకోనట్లయితే భవిష్యత్తులో మార్పేమీ ఉండదు. ఈ సంఘర్షణకీ, గందరగోళానికీ మనలో ప్రతి ఒక్కరూ బాధ్యులని మీరు అనుకోరా?

"కావచ్చు. కాని ఆ బాధ్యతని గుర్తించినందువల్ల ఏమవుతుంది? అంత అపారమైన వినాశక చర్యలో నేను తీసుకున్న చిన్న చర్యకి ఏం విలువ ఉంటుంది? నా ఆలోచన మానవుడి తెలివి తక్కువతనాన్ని ఏ విధంగా