పుట:Mana-Jeevithalu.pdf/280

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నిశ్చలత, ఇచ్ఛ

271

మార్చటంలో కాదు. ఉన్నస్థితిని అది కాని స్థితికి మార్చగలరా? దేవుని కోసం గాని, ధనం కోసంగాని, తాగుడు కోసం గాని ఉండే ప్రలోభం ఎన్నటికైనా ప్రలోభంకానిది అవుతుందా? మనం దేనితో ఏకం అవాలనుకుంటామో అది ఎప్పుడూ స్వయం కల్పితమైనదే - అది మహోత్కృష్టమైనదైనా, ప్రభుత్వమైనా, కుటుంబమైనా. ఏ స్థాయిలో ఏకం కావాలనుకుంటున్నా అది స్వార్థంతో కూడుకొన్నదే.

నిరాడంబరత్వం అంటే ఉన్నస్థితిని అవగాహన చేసుకోవటం, అది ఎంత గందరగోళంగా ఉన్నా సరే. ఉన్నస్థితిని అర్థం చేసుకోవటం కష్టంకాదు. కాని అవగాహనకి అడ్డువచ్చేదేమిటంటే, పోల్చటం ద్వారా, ఖండించటం ద్వారా, దురభిప్రాయం ద్వారా, వ్యక్తమయినా, కాకపోయినా, ఈవిధంగా దృష్టి మరో వైపుకి మరలటమే. ఇవే గందరగోళానికి కారణం. ఉన్నస్థితి దానంతట అది ఎప్పుడూ గందరగోళంగా ఉండదు. అది ఎప్పుడూ సులభంగానే ఉంటుంది.

మీరున్న స్థితిని అర్థం చేసుకోవటం సులభమే. కాని, దాన్ని మీరు సమీపించే పద్ధతి దాన్ని గందరగోళం చేస్తోంది. అందుచేత గందరగోళాన్ని సృష్టించే ఆ మొత్తం పద్ధతి అవగాహన కావాలి. పిల్లవాణ్ణి నిందించకుండా ఉంటే పిల్లవాడు ఉన్నవాడు ఉన్నట్లుంటాడు. అప్పుడు ఏదైనా చెయ్యటానికి అవకాశం ఉంటుంది. నిందించటం గందరగోళానికి దారితీస్తుంది. ఉన్నస్థితిలో వర్తించటం నిరాడంబరత.

నిశ్చలత్వానికి ముఖ్యంగా కావలసినది నిశ్చలత్వం తప్ప మరేదీ కాదు. దానికి మొదలూ, తుదీ అదే. దాన్ని తెచ్చేందుకు అత్యవసరమైనవేవీ లేవు. అది ఉంటుంది. అంతే. ఏ సాధనలూ నిశ్చలత్వానికి దారితీయలేవు. నిశ్చలత్వం ఏదో విధంగా సాధించవలసిన దానిలా అయినప్పుడు మాత్రమే సాధనాలు అత్యవసరమవుతాయి. నిశ్చలత్వాన్ని కొనుక్కోవాలనుకున్నది నిశ్చలత్వం కాదు. సాధనాలు గొడవగా, హింసాత్మకంగా, పైకి తెలియకుండా లాభకరంగా ఉంటాయి. గమ్యం కూడా అలాగే ఉంటుంది, గమ్యం కూడా సాధానాల్లోనే ఉంటుంది కనుక. ఆదిలో నిశ్శబ్దం ఉంటుంది. చప్పుడు, మరింత చప్పుడు చేయటం వల్ల - కృషీ, క్రమశిక్షణా, కఠోర నియమాలూ,