పుట:Mana-Jeevithalu.pdf/279

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

270

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

వినాశకరం. ఎందుకంటే, ఒక లక్ష్యంతో చేసిన పని స్వార్థపూరితంగా, అందరినీ వేరు చేసేట్లుగానూ, విడిగా, ఒక్కరుగా ఉండేట్లూ చేస్తుంది. సంఘర్షణనీ, కోరికని అణచిపెట్టలేరు. ఎందువల్లనంటే, ఆ కృషి చేసేవాడు కూడా సంఘర్షణ నుంచీ, కోరిక నుంచీ పుట్టిన వాడే కనుక. ఆలోచించేవాడూ, అతని ఆలోచనలూ కూడా కోరిక నుంచి వచ్చినవే. కోరికని, అంటే ఆత్మని, దాన్ని ఉన్నతస్థానంలో ఉంచినా, నీచ స్థానంలో ఉంచినా, దాన్ని అర్థం చేసుకోకుండా ఉన్నట్లయితే మనస్సు ఎప్పటికీ అజ్ఞానంలో చిక్కుకుని ఉంటుంది. మహోత్కృష్టమైన దానికి మార్గం ఇచ్ఛలోనూ, కోరికలోనూ లేదు. కృషి చేసేవాడు లేనప్పుడే మహోత్కృష్టమైనది ఉద్భవిస్తుంది. ఇచ్ఛ అనేదే సంఘర్షణనీ, ఏదో అవాలనే కోరికనీ, లేదా, మహోత్కృష్టం కావటానికి మార్గం వేసుకోవటాన్నీ పెంపొందిస్తుంది. కోరిక ద్వారా సంఘటితమైన మనస్సు కృషి లేకుండా అంతమొందినప్పుడే, అప్పుడే, ఆ నిశ్చలతలోనే యథార్థం - లక్ష్యం కానిది - ఆవిర్భవిస్తుంది.

"కాని ఆ నిశ్చలతకి నిరాడంబరత్వం అత్యవసరం కాదా?"

నిరాడంబరత్వం అంటే మీ ఉద్దేశం ఏమిటి? అంటే నిరాడంబరత్వంతో ఏకీభవించటమా, లేక నిరాడంబరంగా ఉండటమా?

"నిరాడంబరమైన వాటితో బాహ్యంగా గాని, అంతర్గతంగా గాని తాదాత్మ్యం చెందకుండా నిరాడంబరంగా ఉండలేరు."

మీరు నిరాడంబరంగా అవుతారు. అంతేనా? మీరు గందరగోళంగా ఉంటారు. కాని తాదాత్మ్యం చెందటం ద్వారా, రైతులాగో, సన్యాసిలాగో దుస్తులు వేసుకోవటం ద్వారా, మిమ్మల్ని వాటితో కలుపుకోవటం ద్వారా మీరు నిరాడంబరంగా అవుతారు. నేను ఇది, నేను అది అవుతాను. కాని, ఈ అయే విధానం నిరాడంబరత్వానికి దారి తీస్తుందా. లేక నిరాడంబరత్వం అనే భావానికి మాత్రమేనా? నిరాడంబరత్వం అనే భావంతో తాదాత్మ్యం కావటం నిరాడంబరత్వం కాదు, అవునా? నేను పనికట్టుకుని నిరాడంబరుడనని చెప్పుకున్నందువల్లనో, నిరాడంబరత్వం అనే రీతితో నన్ను నేను కలుపుకోవటం వల్లనో నేను నిరాడంబరంగా ఉన్నట్లా? ఉన్నస్థితిని అర్థం చేసుకోవటంలోనే నిరాడంబరత ఉంటుంది. అంతేగాని ఉన్నస్థితిని నిరాడంబరత్వానికి