పుట:Mana-Jeevithalu.pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సిద్ధాంతం

237

వాటిని తరవాత ఆచరించటం జరుగుతుంది అంటున్నారు. అందుకని మానసిక అంశాల గురించి మాట్లాడటం జనాన్ని ప్రయత్నపూర్వకంగా పెడదారిని పట్టించటం అనరు కదా. మీరనేదేమిటంటే, మీదొక్కటే సహేతుకమైన సిద్ధాంతం అనీ, అందుకని ఇంకో దానితో ఇబ్బంది పడటం ఎందుకనీ, కదా? మీ సిద్ధాంతం కోసం అంతా కలిసి చర్య తీసుకోవాలను కుంటున్నారు. అందుకని మానసిక ప్రక్రియ గురించి ఇంకా ఆలోచించటం సమయాన్ని వృథా చేయటమే, అసలు విషయాన్ని వదిలి పెడమార్గాన్ని పట్టడమే అంటున్నారు. మీ ప్రకారం అసలు విషయం వర్గభేదం లేని సమాజాన్ని నెలకొల్పటం, అందరికీ పని కల్పించటం మొదలైనవి.

"మా సిద్ధాంతం విస్తృత చారిత్రాత్మక పరిశోధనా ఫలితం. జరిగిన యథార్థాల ప్రకారం చరిత్రను వ్యాఖ్యానించినది. అది వాస్తవిక సిద్ధాంతం, మతానికి చెందిన మూఢ విశ్వాసాల వంటిది కాదు. మా సిద్ధాంతానికి వెనుక అనుభవం ఉంది, కేవలం. ఊహా దృశ్యాలూ, భ్రమలూ కాదు."

మత సంస్థల సిద్ధాంతాలూ, మూఢ విశ్వాసాలూ కూడా అనుభవం మీద ఆధారపడినవే - ఎవరు బోధనలు చేశారో వారివి కావచ్చు. అవి కూడా చారిత్రాత్మక సత్యాలపైన ఆధారపడినవే. మీ సిద్ధాంతం పరిశోధనలవల్లా, కొన్ని యథార్థాలను పోల్చటం వల్లా, వాటిలో కొన్ని యథార్థాలను స్వీకరించి కొన్నిటిని వదిలివేయటం వల్లా ఫలించినది కావచ్చు. మీ నిర్ణయాలు అనుభవం వల్ల కలిగినవి కావచ్చు. కాని మిగిలిన సిద్ధాంతాలు కూడా అనుభవం వల్లనే కలిగినప్పుడు వాటిని తిరస్కరిస్తారెందుకు? మీ సిద్ధాంతం చుట్టూ ఒక గుంపుని చేర్చుకుంటారు, ఇంకొకరు వాళ్ల సిద్ధాంతం చుట్టూ చేర్చుకున్నట్లు. మీరు సామూహిక చర్య కావాలంటారు. వాళ్లూ మరోవిధంగా అదే కావాలంటారు. ప్రతి సందర్భంలోనూ సామూహిక చర్య ఒక భావం నుంచి ఉత్పన్నమవుతుంది. మీ ఇరువురికీ భావాల గురించే ఆలోచన - వ్యక్తంగా కాని, అవ్యక్తంగా కాని - సామూహిక చర్య తీసుకు రావటం కోసం. ప్రతి సిద్ధాంతం వెనుకా అనుభవం ఉంది. ఎటొచ్చీ, మీరు వారి అనుభవంలోని నిజాన్ని ఖండిస్తున్నారు. వారు మీనిజాన్ని ఖండిస్తారు. వాళ్లు మీ వ్యవస్థ ఆచరణ యోగ్యం కాదనీ, బానిసత్వానికి దారి తీస్తుందనీ, ఇంకా ఎన్నో