పుట:Mana-Jeevithalu.pdf/245

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
236
మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

ఆలోచన అనుభూతి మాత్రమే. ఆలోచన ప్రేమ గురించి ఆలోచించలేదు - ప్రేమ మనస్సుకి అందుబాటులో ఉండదు కనుక. ఆలోచన కొనసాగుతూ ఉంటుంది. ప్రేమ తరగనిది, అనంతమైనది, ఎప్పుడూ కొత్తగా ఉంటుంది. కొనసాగుతున్న దానికి ఎప్పుడూ ఆగిపోతుందన్న భయం ఉంటుంది. అంతమొందేదానికి ప్రేమ అనంతంగా ఆరంభం కావటం తెలుస్తుంది.

72. సిద్ధాంతం

"ఈ మనస్తత్వం గురించీ, మనస్సులోపల జరిగే కార్యకలాపాల గురించీ మాట్లాడినదంత సమయం వృథా చేయటానికే, జనానిక్కావలసినది పని, తిండి, మొట్టమొదట ఎదుర్కోవలసినది ఆర్థిక పరిస్థితి అని స్పష్టమైనప్పుడు మీరు శ్రోతల్ని ప్రయత్నపూర్వకంగా పెడదారి పట్టించటం లేదా? మీరు చెప్పేదానికి ఆఖరున ప్రయోజనం ఉంటే ఉండొచ్చు. కాని జనం మలమలమాడిపోతూంటే ఈ చెత్తంతా ఏ ప్రయోజనకరం? కడుపు నిండుగా లేకపోతే మీరు ఏమీ ఆలోచించలేరు. ఏమీ చెయ్యలేరు."

గడుపుకు పోవటానికి కడుపులో కొంత ఏదో పడాలన్నది నిజమే. కాని, అందరికీ తిండి దొరకాలంటే మన ఆలోచనా విధానంలోనే మూల పరివర్తన రావాలి. అందువల్లనే మానసిక రంగాన్ని ఎదుర్కోవటం ముఖ్యం. మీకు తిండి సరుకులు తయారుచేయటం కన్న సిద్ధాంతమే ఎంతో ఎక్కువ ముఖ్యం. బీద జనులకి తిండి ఉండాలనీ, వారి గురించి విచారించాలనీ మీరు మాట్లాడవచ్చు. కాని మీరు మీ ఉద్దేశం గురించీ, మీ సిద్ధాంతం గురించే ఎక్కువ విచారించటంలేదా?

"అవును, అదే చేస్తున్నాం. కాని, సామూహిక చర్య తీసుకోవటానికీ, జనాన్ని పోగుచెయ్యటానికీ సాధనం మాత్రమే సిద్ధాంతం. ఒక ఉద్దేశం లేకుండా అందరూ కలిసి పనిచెయ్యటం కుదరదు. ఉద్దేశం, ప్రణాళిక మొదట వస్తాయి. తరవాత ఆచరణ జరుగుతుంది."

ఇందువల్ల మానసిక అంశాలను మీరూ మొదట విచారిస్తున్నారు.