పుట:Mana-Jeevithalu.pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

226

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

"నిశ్చయంగా. అందుకే పూర్వం ఏ కర్మ చేయటం వల్ల ఈ అంధత్వం ప్రాప్తించిందో తెలుసుకోవాలనుకుంటున్నాను. దాని వల్ల ఎంతో తృప్తి కలుగుతుంది."

అందువల్ల మీకు కావలసినది తృప్తి; అవగాహన కాదు.

"రెండూ ఒకటే కాదా? అర్థం చేసుకోవటమంటే తృప్తి పొందటమే. అవగాహన వల్ల ఉపయోగం ఏముంది అందులో ఆనందం ఏకపోతే?"

యథార్ధాన్ని అవగాహన చేసుకోవటం వల్ల ఇబ్బంది కలగొచ్చు, ఆనందమే కలగాలని లేదు. మీ అబ్బాయికి రోగం వచ్చిందన్న యథార్థం మీకు బాధ కలిగించింది. మీకు ఓదార్పు కావాలి. ఓదార్పునే మీరు అవగాహన అంటున్నారు. మీరు బయలుదేరింది అవగాహన చేసుకోవటానికి కాదు; ఓదార్పు పొందటానికి. మీ బాధకి ఉపశమనం కలిగించుకోవటమే మీ ఉద్దేశం. దీన్నే మీరు కారణం కోసం అన్వేషించటం అంటున్నారు. మీకు కావలసినదల్లా మిమ్మల్ని నిద్రపుచ్చే మార్గం, మీకు ఇబ్బంది లేకుండా ఉండే మార్గం - దానికోసమే ప్రయత్నిస్తున్నారు. మనల్ని మనం అనేక విధాలుగా నిద్రపుచ్చుకుంటాం - దేవుడనీ, పూజలనీ, ఆదర్శాలనీ, తాగుడు అనీ, ఈ రకంగా. ఇబ్బంది నుంచి తప్పించుకోవాలనుకుంటాం. తప్పించుకునే మార్గాల్లో ఈ కారణం కోసం వెతకటం ఒకటి.

"ఇబ్బంది లేకుండా స్వచ్ఛగా ఉండాలని ఎందుకు ప్రయత్నించకూడదు? బాధని ఎందుకు తప్పించుకోకూడదు?"

తప్పించుకోవటం వల్ల బాధ నుంచి విముక్తి కలుగుతుందా? ఏదో అసహ్యకరమైనదో, ఏ భయంకరమైనదో కనిపించకుండా తలుపు మూసేసుకోవచ్చు. కాని అది తలుపు అవతలే ఉంటుంది, కాదా? అణచివేసిన దాన్నీ, ప్రతిఘటించిన దాన్నీ అర్థం చేసుకోలేము, అవునా? మీ బిడ్డని అణచి ఉంచొచ్చు, క్రమశిక్షణలో పెట్టొచ్చు, కాని, నిజానికి దానివల్ల, మీ బిడ్డని మీరు అర్థం చేసుకోవటం మాత్రం కుదరదు. ఇబ్బంది వల్ల కలిగే బాధని తప్పించుకోవటానికి మీరు కారణాన్ని వెతుకుతున్నారు. ఆ ఉద్దేశంతో వెతికితే మీకు కావలసినదే మీకు దొరకుతుంది. బాధ ఏ విధంగా కలుగుతుందో, అడుగ