పుట:Mana-Jeevithalu.pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆలోచన ఆగిపోవటం

213

ఉన్నప్పుడు పని చేయనివి కలలోకి రావటంతో చైతన్యావస్థ విస్తరిస్తుంది. మనస్సు పైపైన, లోలోపల జరిగే కార్యకలాపం వ్యాపకం కోసమే. అటువంటి మనస్సుకి తెలిసిన అంతం - మొదలైనది కొనసాగటమే. అంతం అనేది అది తెలుసుకోలేదెన్నటికీ. దానికి ఫలితం మాత్రమే తెలుసును. ఫలితం నిత్యం కొనసాగుతూ ఉండేదే. ఫలితం కోసం ప్రయత్నించటం కొనసాగటానికి ప్రయత్నించటమే. మనస్సుకీ, వ్యాపకానికీ అంతంలేదు. అంతమైన దానికే కొత్తది రాగలుగుతుంది. మరణించిన దానికే జీవం వస్తుంది. వ్యాపకం మరణించటంతో, నిశ్శబ్దం ఆరంభమవుతుంది. సంపూర్ణ నిశ్శబ్దం. ఆలోచించటానికి వీల్లేని ఈ నిశ్శబ్దానికీ మానసిక కార్యకలాపానికీ సంబంధం ఉండదు. సంబంధం ఉండటానికి కలయిక ఉండాలి. మనస్సు నిశ్శబ్దంతో సంపర్కం పెట్టుకోలేదు. అది స్వయంకల్పిత స్థితితో, అది నిశ్శబ్దం అనుకునే దానితో మాత్రమే సంపర్కం పెట్టుకోగలదు. అది మరొక రకం వ్యాపకం. వ్యాపకం నిశ్శబ్దం కాదు. నిశ్శబ్దంతో వ్యాపకం కలిగించుకునే మనస్సు మరణించినప్పుడే, నిశ్శబ్దం ఉంటుంది.

నిశ్శబ్దం కలకీ, మనస్సు లోలోపలి వ్యాపకానికీ అతీతమైనది లోలోపలి మనస్సు శేషం - గతశేషం - బాహటమైనది గాని, నిగూఢమైనది గాని. ఈ గత శేషం నిశ్శబ్దాన్ని అనుభవం పొందలేదు. దాని గురించి కలగన లేదు - తరుచు అది చేసేటట్లు. కాని కల నిజం కాదు. కలని తరుచు నిజం అనుకుంటారు. కాని, కలా, కలగనేదీ కూడా మనోవ్యాపకమే. మనస్సు సంపూర్ణ ప్రక్రియ - ఒక్క భాగం మాత్రమే కాదు - కార్యకలాపం యొక్క సంపూర్ణ ప్రక్రియ. మిగిలి ఉన్నదీ, సేకరించుకున్నదీ ఆ అనంత నిశ్శబ్దంతో సంపర్కం పెట్టుకోలేవు.

66. ఆలోచన ఆగిపోవటం

ఆయన పండితుడు, ప్రాచీన సాహిత్యాన్ని బాగా చదువుకున్నవాడు. తన సొంత ఆలోచనలకు మెరుగులు దిద్దటానికి ప్రాచీనులను ఉదాహరించటం అలవాటు చేసుకున్నాడు. ఆ గ్రంథాల్లోవి కాకుండా ఆయన