పుట:Mana-Jeevithalu.pdf/223

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
214
మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

స్వతంత్ర అభిప్రాయాలంటూ నిజంగా ఉన్నాయా అనిపిస్తుంది. నిజానికి, అసలు స్వతంత్ర ఆలోచన అనేదే లేదు. ఆలోచన అంతా ఆధారపడినదే, ప్రభావితమైనదే. ఆలోచన ఎన్నటికీ స్వేచ్ఛగా ఉండదు. కాని, ఆయన జ్ఞానార్జన గురించి ఆలోచిస్తున్నాడు. ఆయన జ్ఞాన భారంతో ఉన్నాడు. దాన్ని కష్టపడి మోస్తున్నాడు. ఆయన సంస్కృతంలోనే మాట్లాడటం మొదలు పెట్టాడు. సంస్కృతం ఏమీ అర్థం కాలేదని తెలుసుకుని ఆశ్చర్య పోయాడు. అదిరిపడ్డాడు కూడా. ఆయన నమ్మలేకపోయాడు. "ఎన్నో సమావేశాల్లో మీరు మాట్లాడిన దాన్నిబట్టి మీరు సంస్కృతంలో బాగా చదివి ఉంటారని, లేదా, మహా బోధకుల గురించి అనువాదాల్లోనైనా చదివి ఉంటారని అనిపిస్తుంది" అన్నాడు. అదేమీ కాదనీ, అంతేకాక, ఏ విధమైన మత, వేదాంత, మానసిక సంబంధమైన పుస్తకాలూ చదవలేదనీ తెలుసుకున్నప్పుడు తన అపనమ్మకాన్ని దాచుకోలేక పోయాడు.

ముద్రితమైన మాటకీ, పవిత్ర గ్రంథాలనబడే వాటికీ ఎంత విలువ నిస్తామో చిత్రంగా ఉంటుంది. పండితులుకూడా పామరుల్లాగే గ్రామఫోనులు. పునశ్చరణ చేస్తూనే ఉంటారు, రికార్డులు ఎన్నిమార్చినా. వారికి కావలసిన దల్లా జ్ఞానం. అంతేకాని, అనుభవంకాదు. అనుభవించటానికి జ్ఞానం ప్రతిబంధకం. కాని జ్ఞానం సురక్షితమైన ఆశ్రయం. కొద్దిమంది తెలియని వాళ్లు జ్ఞానానికి ముగ్ధులై, తెలిసిన వారిని గౌరవిస్తారు. సన్మానిస్తారు. జ్ఞానం కూడా ఒక దురలవాటే, తాగుడులాగ. జ్ఞానం వల్ల అవగాహన కలగదు. జ్ఞానాన్ని బోధించవచ్చు, కాని వివేకాన్ని కాదు. వివేకం కలగటానికి జ్ఞానం నుంచి స్వేచ్ఛ పొందాలి. జ్ఞానం నాణెం కాదు వివేకాన్ని కొనుక్కునేందుకు. జ్ఞానంలో ఆశ్రయం పొందినవాడు బయటికి రావటానికి ధైర్యం చేయడు, మాటలే అతని ఆలోచనలకు ఆహారం కనుక. ఆలోచించటంతోనే తృప్తి పొందుతాడు. ఆలోచించటం అనుభవించటానికి ప్రతిబంధకం. అనుభవించటం లేకుండా వివేకం ఉండదు. జ్ఞానం, ఊహ, నమ్మకం అనేవి వివేకం కలగకుండా అడ్డు నిలుస్తాయి.

వ్యాపకంతో ఉన్న మనస్సు స్వేచ్ఛగా అనాలోచితంగా ఉండదు. అనాలోచిత స్థితిలోనే ఏదైనా సాక్షాత్కారం కాగలదు. వ్యాపకంతో ఉన్న