పుట:Mana-Jeevithalu.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఒకే రీతిగా ఉండటం

133

బహిరంగంగా సంఘర్షణని తెస్తుంది. సంఘర్షణ వైరుధ్యాన్ని సూచిస్తుంది. కోరిక తీరుతెన్నులను అర్థం చేసుకోవటంలోనే స్వీయ వైరుధ్యం నుంచి విముక్తి లభిస్తుంది.

సమైక్యత మనస్సు యొక్క పై అంతస్తులకే పరిమితం కాజాలదు. అది పాఠశాలలో నేర్చుకుంటే వచ్చేది కాదు. జ్ఞానం వల్లగాని, ఆత్మ త్యాగం వల్ల గాని రాదు. సమైక్యత ఒకే రీతిలో ఉండటం నుంచీ, వైరుధ్యం నుంచీ కూడా విముక్తి కలుగజేస్తుంది. కాని, సమైక్యత అంటే అన్ని కోరికల్నీ, అన్నిరకాల ఆసక్తుల్నీ కలిపి ఒకేలా చేయటం కాదు. సమైక్యత ఒక పద్ధతి ప్రకారం నడుచుకోవటం కాదు - ఆ పద్ధతి గౌరవనీయమైనదైనా సరే, కపటమైనదైనా సరే - దాన్ని సూటిగా, స్పష్టంగా సమీకరించటం కాదు, మరోదారిని, అగోచరంగా సమీపించాలి. సమైక్యతని ఊహించటం అంటే ఒక పద్ధతిని అవలంబించటమే - దానివల్ల తెలివితక్కువ తనం, వినాశకత్వం పెంపొందుతాయి. సమైక్యతకి ప్రయత్నించటం అంటే, దాన్నొక ఆదర్శంగా, స్వయం కల్పిత లక్ష్యంగా చేయటమే. అన్ని ఆదర్శాలూ స్వీయ కల్పితాలే కనుక అవి తప్పనిసరిగా, సంఘర్షణకీ, శత్రుత్వానికీ కారకమవుతాయి. వ్యక్తి తనకు తాను కల్పించే రూపం తన ప్రకృతిదే కాబట్టి అది వైరుధ్యయుతంగానూ, సందిగ్ధ జనకంగానూ ఉంటుంది. సమైక్యత ఒక ఊహకాదు. కేవలం జ్ఞాపకం వల్ల కలిగిన ప్రతిక్రియ కాదు. అందువల్ల దాన్ని పెంచటానికి వీలవదు. సంఘర్షణ ఉన్నందువల్లనే సమైక్యత కావాలనే కోరిక కలుగుతుంది. సమైక్యత పెంపొందించుకోవటం ద్వారా సంఘర్షణకి అతీతం కావటం జరగదు. వైరుధ్యాన్ని కప్పిపుచ్చవచ్చు. లేదనవచ్చు, ఉందని తెలియకుండా ఉండొచ్చు. కాని అది అక్కడే ఉంటుంది - బయట పడటానికి ఎదురుచూస్తూ.

సంఘర్షణనే మనం పట్టించుకునేది, సమైక్యతని కాదు. సమైక్యత కూడా శాంతి లాగే అసలు లక్ష్యం కాదు. పక్క నుంచి పుట్టుకొచ్చినది. అది ఒక ఫలితం మాత్రమే - అందువల్ల దానికంత ప్రాముఖ్యం లేదు. సంఘర్షణని అర్థం చేసుకోవటంతో సమైక్యత, శాంతమే కాక అంతకన్న అనేక రెట్లు గొప్పదైన దేదో ఉంటుంది. సంఘర్షణని అణచివెయ్యటం గాని, పవిత్రం చెయ్యటం గాని సాధ్యం కాదు. దానికి ప్రత్యామ్నాయంగా మరొకటి లేదు. సంఘర్షణ