పుట:Mana-Jeevithalu.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

132

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

తనతో తను వైరుధ్యంతో ఉండటం అంటే సంఘర్షణతోనూ, దుఃఖంతోనూ జీవించటం. 'నేను' స్వభావమే స్వతస్సిద్ధంగా వైరుధ్యంతో కూడుకున్నది. రకరకాల ముఖాలతో ఉండే పరస్పర విరుద్ధమైన ఆసక్తులూ, విలువలూ, వివిధస్థాయిల్లో అనేక రకాల కోరికలతో కలిసి వేయబడినది. ఈ 'తను', ఈ 'నేను' రకరకాల కోరికల వల. ప్రతి కోరికకీ దాని ప్రేరణా, దాని లక్ష్యం దానికుంటాయి. ఇతర ఆశలకూ, ప్రయత్నాలకూ తరచు వ్యతిరేకంగా ఉంటాయి. ఉత్సుకత కలిగించే పరిస్థితులనూ అనుభూతులనూ బట్టి ఇవి బహుముఖాలు తగిలించుకుంటాయి. అందుచేత 'నేను' నిర్మాణ క్రమంలోనే ఉన్న వైరుధ్యం మనలో భ్రమనీ, బాధనీ పెంపొందిస్తుంది. దాన్ని తప్పించుకోవటానికి అన్ని రకాల స్వీయవంచనలకూ సిద్ధమవుతాము. దానివల్ల సంఘర్షణా, దుఃఖం మరింత అధికమవుతాయి. అంతరంగిక వైరుధ్యం దుర్భరమై పోయినప్పుడు మనం తెలిసిగాని, తెలియకుండా గాని మరణం ద్వారానో, మతి భ్రమణం ద్వారానో తప్పించుకునేందుకు ప్రయత్నిస్తాం. లేదా, ఒక భావానికో, ఒక సంఘానికో, ఒక దేశానికో, ఏదో కార్యకలాపానికో అంకితమైపోతాం. అది మనల్ని పూర్తిగా ఆకట్టుకుంటుంది. లేదా, ఒక మత సంస్థవైపుకీ, దాని ప్రగాఢ విశ్వాసాల వైపుకీ, ఆచారాలవైపుకీ మొగ్గుతాం. మనలోని ఈ విభజన మరింత ఆత్మవిస్తరణకో, వినాశానికో, మతి భ్రమణానికో దారి తీస్తుంది. మనం ఉన్నట్లు కాకుండా ఇంకేదో అవాలనే ప్రయత్నం వైరుధ్యాన్ని పెంచుతుంది. ఉన్న స్థితి అంటే ఏర్పడిన భయం దానికి వ్యతిరేకమైన ఒక భ్రమని పెంపొందిస్తుంది. ఆ వ్యతిరేకమైన దాని కోసం ప్రయత్నించటంలో భయం నుంచి తప్పించుకోగలమని ఆశపడతాం. సమన్వయం అంటే వ్యతిరేకమైనదాన్ని పెంచటం కాదు. సమన్వయం వ్యతిరిక్తత వల్ల రాదు. ప్రతి దానిలోనూ దానికి వ్యతిరేకమైన అంశాలు ఇమిడి ఉంటాయి. మనలోని వైరుధ్యం ప్రతి రకమైన శారీరక, మానసిక ప్రతిక్రియకీ దారితీస్తుంది. ఆ ప్రతిక్రియ సౌమ్యంగా ఉండొచ్చును. గౌరవనీయంగా ఉండొచ్చును, ప్రమాదకరంగా ఉండొచ్చును. ఒకే రీతిగా ఉండటం వల్ల ఈ వైరుధ్యం మరింత గందరగోళంగా, మరింత అస్పష్టంగా తయారవుతుంది. ఒకే ఒక్క కోరికనో, ఆసక్తినో కేంద్రీకృతం చేసుకుని దాన్ని సాధించటానికి ప్రయత్నించటం వల్ల వ్యతిరిక్తత 'నేను' ని ఆవరిస్తుంది. అంతరంగిక వైరుధ్యం