పుట:Mana-Jeevithalu.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"నా మార్గం - మీ మార్గం"

115

పడినప్పుడు పట్టుకోవాలి, సొంతం చేసుకోవాలి, మీరు సొంతం చేసుకున్నది మిమ్మల్నే సొంతం చేసుకుంటుంది. సూక్ష్మంగా గాని, స్థూలంగా గాని ఏ విధంగానూ ఆధారపడకుండా, వస్తువుల్నీ, మనుష్యుల్నీ, భావాల్నీ సొంతం చేసుకోకుండా ఉంటే మీరు శూన్యంగా ఉంటారు - మీరు ఏవిధమైన ప్రాముఖ్యం లేనట్లుగా ఉంటారు. మీరు ఏదో అవాలనుకుంటారు; ఏమీ కాకపోతే ఏమవుతుందోననే ఎముకలు కొరికే భయాన్ని తప్పించుకోవటానికి ఇదో అదో ఏదో ఒక సంస్థకో, ఏదో ఒక సిద్ధాంతానికో, ఈ చర్చికో, ఆ దేవాలయానికో చెందుతారు. ఆ విధంగా ఇతరుల లాభానికి వినియోగింప బడతారు. దాంతో, మీరూ స్వలాభానికీ ఇతరులను వినియోగించుకుంటారు. ఈ అధికార పరంపర నిర్మాణం ఆత్మవిస్తృతికి అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది. మీరు సౌభ్రాతృత్వాన్ని కోరవచ్చు. కాని, సౌభ్రాతృత్వం ఎలా ఉంటుంది - మీరు ఆధ్యాత్మిక వినాశానికి ప్రయత్నిస్తున్నప్పుడు? ప్రాపంచిక పదవుల్ని చూసి మీరు నవ్వొచ్చు. కాని మీరు దివ్య ప్రభువునీ, రక్షకుడినీ, గురువునీ ఆధ్యాత్మిక రంగంలో ఒప్పుకుంటున్నప్పుడు మీరు ప్రాపంచిక ప్రవృత్తిని అందులోకి కూడా తోడ్కొనిపోతున్నట్లు కాదా? ఆధ్యాత్మిక వికాసంలోనూ, సత్యాన్ని అవగాహన చేసుకోవటంలోనూ, దైవాన్ని తెలుసుకోవటంలోనూ అధికార పరంపర విభజనలూ, తరతమ భేదాలూ ఉండగలవా? ప్రేమ విభజనకి తావివ్వదు. ప్రేమిస్తారు, లేకపోతే లేదు, అంతేకాని, ప్రేమ లేకుండా ఉండే సుదీర్ఘ మార్గాన్ని అవలంబిస్తూ ప్రేమ అనే లక్ష్యాన్ని చేరుకోవటం కుదరదు. మీరు ప్రేమించటం లేదని మీకు "తెలిసి"నప్పుడు ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా ఆ యథార్థాన్ని తెలుసుకున్నప్పుడు పరివర్తన రావటానికి అవకాశం ఉంటుంది. కాని, గురువుకీ శిష్యుడికీ మధ్య, సిద్ధి పొందిన వారికీ పొందని వారికీ మధ్య, రక్షకుడికీ పాపికీ మధ్య విభేదాన్ని శ్రమపడి అలవరచుకోవడమంటే ప్రేమని వదులుకోవటమే. స్వలాభానికి ఇతరులను వినియోగించుకునేవాడూ, మరోవైపు తాను ఇతరులచే ఉపయోగింపబడేవాడు, ఈ అంధకారంలో, ఈ భ్రమలో ఆనందంగా వేటాడుకోవచ్చు.

దైవానికీ, లేదా సత్యానికీ మీకూ మధ్య ఎడం మీరు తెచ్చుకున్నదే -