పుట:MaharshulaCharitraluVol6.djvu/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

94

మహర్షుల చరిత్రలు


యాతనిం బ్రదికించి తీసికొనిరమ్మని తన మృతసంజీవనీవిద్యం బంపెను. మహాప్రసాద మని యా విద్య శరవేగమున నేగి కచుని సంజీవితు నొనర్చి తీసికొని వచ్చెను. తండ్రికూఁతు లిరువురు నాతనింజూచి సంతోషించిరి.

ఈ సంగతి నెఱింగిన రాక్షసు లీసారి యట్లు కాదని యడవికిఁ బువ్వుల కరిగినకచునిఁ బట్టుకొని చంపి కాల్చి బూడిదచేసి యా బూడిద కల్లులోఁ గలిపి యా కల్లు తెలుపకుండ శుక్రునిచేఁ ద్రాగించిరి. సురాపాన మోహితుఁడగు శుక్రాచార్యుఁ డేమియు నెఱుఁగఁ డయ్యెను. దేవయాని కచునిం గానక వెక్కి వెక్కి యేడ్వఁదొడంగెను. “ఓసీ ! ఏల యేడ్చెదవు? ఇంక నెన్నిసారులు బ్రదికించినను రాక్షసు లాతనినిఁ జంపక మానరు. అతఁడు సుగతికే పోయియుండును. ఇంక నతని కొఱ కేడ్వకు" మని శుక్రాచార్యుఁడు దేవయానితో ననెను. అంత దేవయాని కన్నులనీరు వఱదలై చన్నులవెంటఁ బ్రవహింప :

"మతిలోకోత్తరుఁ డై నయంగిరసుమన్మం డాశ్రితుం డా బృహ
 స్పతికిం బుత్రుఁడు మీకు శిష్యుఁడు సురూపబ్రహ్మచర్యాశ్రమ
 వ్రతసంపన్నుఁ డకారణంబ దనుజవ్యాపాదితుండైన న
 చ్యుతధర్మజ్ఞ! మహాత్మ ! య క్కచున కే శోకింప కెట్లుండుదున్ ?
                                                          భార. అది. 3. 1,1,8.

వానినిఁ జూచి కాని నే భుజింప; నిద్రింప; జీవింప" నని యేడ్చెను. శుక్రాచార్యుఁడు కొంత సేపటికిఁ గూరిమిపట్టి పైఁగల మమత్వము, అనుంగు శిష్యునిపైఁ గలవాత్సల్యము స్మరించి దివ్యదృషి సారించి లోకాలోక పర్యత పర్యంతభువనాంతరమున నెక్కడమ గచుని గానఁ డయ్యెను. తుదకు బూడిదయై సురతోఁ గలిసి తన కడుపుననే యున్న కచుఁ డాతనికి గోచరించెను. సురాపాన దోషము, అసురాపకారావమానము హృదయమును దహింప శుద్రాచార్యుఁ డిట్లు తలపోసెను. " అయ్యో ! ఎన్ని జన్మములందో యెంతో శ్రమపడి సంపాదించినపుణ్య మంతయు నొక్క క్షణములో సురాపానదోషమునఁ బోవుటేకాళ మహాపాపము పైఁ బడుఁగదా! ఇట్టిదోషభూయిష్ట మైనసురాపానము బ్రాహ్మణులకు