పుట:MaharshulaCharitraluVol6.djvu/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శుక్రమహర్షి

95


క్షంతవ్యమగునా ? సర్వరాక్షసలోకగురుఁడను; సర్వవిద్యా వివేకకోవిదుఁడను, నేనే యీ దోషమున నింత యవివేకముగా మోసపోతినే? ఇఁకఁ బ్రపంచముగతి యేమి? ఇట్లు తలపోసి శుక్రాచార్యుఁడు సురాపానము మహాపాపమనియు విశేషించి విపుల కది సర్వవినాశహేతు వనియు శపించెను.

శుక్రుఁడు విద్యావినయవివేకసంపన్నుఁడు, విశేషించి ప్రియశిష్యుఁడు నగుకచుని బ్రదికింప కెట్లుందు ననుకొని యాతనిం దనసంజీవనీ మంత్రముచేఁ గడుపులోనే బ్రదికించెను. కచుఁడు కడుపులోనుండి " జయ గురుదేవా! కృతజ్ఞుఁడను. నీ దయవలన శరీరము, ప్రాణము, బలమును పొందితిని. బయటపడు నుపాయముఁ జెప్పి రక్షింపవే” యని మిక్కిలి ప్రార్థించెను. అందులకు శుక్రాచార్యుఁ డిట్ల నెను. “వత్సా ! నా కడుపు బ్రద్దలైనఁగాని నీవు బయటపడలేవు. నా కడుపు బ్రద్దలైనచో నేను చనిపోవుదును. నన్ను బ్రదికించు విద్య మృతసంజీవని నీకు బోధింపవలయును. నే నట్లు చేసినచో నీ వచ్చినపనియై దేవతలకు మేలగును. నా శిష్యులగు రాక్షసులకుఁ గీడగును. ఐనఁ గానిమ్ము. విద్యావినయవివేకములు, శ్రద్ధాభయభక్తులుగలిగి, గురుశుశ్రూషాపరాయణులు, లోకోపకారకులు, నియమవ్రతశీలురునగు ఆత్మీయప్రియ శిష్యులకుఁ బరమరహస్య విద్యయైనను బోధింపక దాచుకొనుగురువు గురువు కాఁడు, నిరయవాసి యగును. కావున, ఏదియేమైనను నీ కీ విద్య బోధించెదను. నీవు నాకడుపు ప్రక్కలుచేసికొనివచ్చి చచ్చిన నన్ను బ్రదికింపుము."

ఇట్లు పలికి శుక్రాచార్యుఁడు లోకోత్తర మగుసంజీవనీ విద్యను లోకోత్తరుఁడగు కచునకు లోకోత్తరపద్దతిని బ్రసాదింపఁగనే కచుఁడు గురునికడుపు బ్రద్దలు చేసికొని బయటికివచ్చి వెనువెంటనే తాను నేర్చిన విద్యచే విగతజీవుఁడై పడియున్న వేదమూర్తిని బ్రదికించెమ. ఆ గురుశిష్యులను సర్వదేవతలు నభినందించి పుష్పవృష్టి వారిపైఁ గురియించిరి. | దేవయానియానందమునకుఁ బట్టపగ్గములు లేకుండెను.

ఇట్లు శుక్రాచార్యుఁడు సమస్తము నెఱిఁగియు శిష్యరత్నమగు కచునకుఁ దనకు ప్రాణప్రదమగువిద్యను బోధించి తన యుదారతను,