పుట:MaharshulaCharitraluVol6.djvu/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

88

మహర్షుల చరిత్రలు

ఇట్లుండ దేవతలు విజృంభించి యొక్క పెట్టున రాక్షసుల నుక్కడఁ గింపఁ దొడంగ వారు గతి లేక శుక్రాచార్యుఁడు లేమి విచారించి యాతని తల్లియు భృగుపత్నియు నగు ఉశనకడ కేగి మొఱపెట్టుకొనిరి. ఆమె వారి కభయ మిచ్చి యాదరించెను. ఈ సంగతి విని యింద్రుఁడు దేవతలతో నామెపై కి యుద్ధమునకు వచ్చెను. ఉశన వెంటనే యోగ బలమున నిద్రాదేవత నింద్రునిపై కిఁ బంపెను. ఆ కారణమున నింద్రుఁడు మోహబద్ధుఁడై కదలలేక మెదల లేక కునికిపాటులు పడుచుఁ గూర్చుండి పోయెను. దేవత లెంత యత్నించిన నాతనికి తెలివి కలుగకుండెను . అపుడు దేవతలంద ఱాలోచించి పరుగుపరుగునఁబోయి హరిని శరణుఁ జొచ్చి జరిగినసంగతి విన్నవించి కాపాడు మని ప్రార్థించిరి. హరి వారి కభయమిచ్చి వారివెంట భృగువత్నికడ కేగి యచటఁ బడియున్న యింద్రునిఁ దనలోఁ బ్రవేశింపు మనఁగా నాతఁ డాహరియందుఁజేరి తెలివంది శుక్రమాతతో యుద్ధమునకుఁ దలపడెను. శుక్రమాతయు, భృగువత్నియు నగు ఉశనాదేవి కన్నుల నిప్పులు గ్రక్కుచు “ఓరీ! ఇంద్రా!

“అగణితమాహాత్మ్యుం డగు
 భృగుమౌనికి నేను బత్ని నెవ్వనిలో మ్రు
 చ్చుగ నీవు చొచ్చితివొ యా
 భగవంతుని నిన్నుఁ గూడ భస్మ మొనర్తున్."

అని యా మహాసాధ్వి పలికిన వెంటనే ప్రమాద మాశంకించి విష్ణువు తన చక్రమున నా మెతల నఱికెను. భృగుపత్ని శిరము వెంటనే నేలఁబడెను. ఇంద్రుఁడు ఉపేంద్రుఁడు వెడలిపోయిరి.

ఆ సమయముననే భృగుమహర్షి యాశ్రమమునకు వచ్చెను. రాఁగానే యాతనికి నేలపైఁ దలతెగి పడియున్నపత్ని గోచరించెను. దివ్యదృష్టి పాఱించి సంగతియంతయుఁ దెలిసికొని తోకఁదొక్కినత్రాచువలె లేచి “ధర్మ మెఱిఁగియుఁ దరుణిని జంపినదోషమునకు విష్ణువు భూమిపై నేడుమారులు నరుఁడై పుట్టుఁగాక ” యని శపించి భృగుమహర్షి భార్య తలతీసి మొండెముకడ నుంచీ యతికి " నేను ధర్మస్థిరు