పుట:MaharshulaCharitraluVol6.djvu/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శుక్రమహర్షి

89


డనే యైనచో నాపత్ని తత్క్షణమే బ్రదుకుఁగాక ! ” యని పలికినంతనే దివ్యసాధ్వియై యా మహాసాధ్వి లేచి నిలిచి భర్తకు మ్రొక్కెను.

ఈ సంగతి తెలిసి యింద్రుఁడు భయపడిపోయి శుక్రాచార్యుఁడు తపమున శివుని మెప్పించి వచ్చినచో నింకను గొంపమునుఁగు నని యెంచి యాతనితపోభంగ మొనరింప నిశ్చయించెను. చక్కని చుక్కయు, సర్వశుభలక్షణయు నగు జయంతి యను తనకూఁతును బిలిచి శుక్రాచార్యుని కుపచారములు చేసి యెట్లైన నాతనిని వలలో వేసికొ మ్మని నియోగించెను.

జయంతి తండ్రియాజ్ఞ నౌదలధరించి పోయి శుక్రాచార్యునికిఁ బరిచర్యలు చేయుచుండెను. ఆతఁడు కోరకున్నను దనపాణిపద్మములచే నాతని పదపద్మము లొత్తుచుండెను. తపోగ్ని మధ్యమున ముచ్చెమటలు పోసినపు డాతనిస్వేద మామె తనమనోహర చీనిచీనాంబరముచేఁ దుడుచుచుండెను. అతఁడు కనువిప్పినవేళఁ దనకడకంటి చూడ్కు లాతనిపై గుమ్మరించెడిది. అగ్నిహోత్రము కూర్చుచు, పూలు కోసి కొని వచ్చియిచ్చుచు, పైఁటకొంగుతో విసరుచు, ఆ యిందువదన మందగమనముఁ జూపుచు నాతని వశపఱచుకొను నెడరు వేచియుండెను. కాని, వ్రతనిష్ఠాగరిష్ఠుఁడై యాతఁడు వేయిసంవత్సరములు నచంచలుఁడై గడపెను.

శుక్రునిమహానిష్ఠకు సంతసించి శివుఁడు ప్రత్యక్షమై "భార్గవా! ఇంతవఱకు ఈ “కణధూమవ్రత' మాచరించి తుదనెగ్గిన వాఁ డెవ్వఁడును లేఁడు. నీ విందు నెగ్గుటచే నీకోరిన కోరిక తీరుటయే కాక నిన్ను జయించు వాఁడే యెవఁడు నుండఁడు. ధనము, వ్రజ, విజయము, నిన్ను వరింప నీవు మహానుభావుఁడ వయ్యెద” వని వరము లిచ్చి యదృశ్యుఁ డయ్యెను.

పిదప శుక్రాచార్యుఁడు తనకు నిరుపమాన మగుసేవ యొనరించిన జయంతిని ముద్దులుమూటగట్టు నవయౌవనవిరాజితను గాంచి “తరుణి ! నీ వేకోరికఁ గోరి నన్నర్చించితివో నీకా కోరిక సిద్దింపఁజేసెదను. చెప్పు”