పుట:Maharshula-Charitralu.firstpart.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

66

మహర్షుల చరిత్రలు


జన్మించెను; అప్పు డాకసమున దేవతూర్యఘోషములు తుముల, మయ్యెను. దేవతా బృందములు మందారవృష్టిఁ గురుసిరి; గంధర్వ కిన్నర గానములు నప్పరోవనితల యాటపాటలు నొప్పెను. పిమ్మట నారాయణుని దర్శించుకొఱకు మరీచిప్రముఖమునిగణసేవితుఁడై చతుర్ముఖుఁడు వచ్చి కపిలుని దర్శించి దేవహూతీ కర్దముల కాతని నెఱిఁగించి మరీచిని దిగవిడిచి సనకసనందన నారదులతో నంతర్హితుఁ డయ్యెను.

కపిలమహర్షి తండ్రికిఁ గర్తవ్యము బోధించుట

పిమ్మటఁ గర్దమ ప్రజాపతియుఁ దన దుహితల వివాహ మాడుటకు మహర్షులఁ బిలువఁ బంచి వారు వచ్చిన వెంట నే మరీచికిఁ గళను, అత్రిమహర్షికి కనసూయను, అంగీరసునకు శ్రద్ధను, పులస్త్యునకు హవిర్భువును, పులహునకు గతిని, క్రతువునకుఁ గ్రియను, భృగువునకు ఖ్యాతిని, వసిష్ఠుని కరుంధతిని, అధర్వునకు శాంతిని నిచ్చి నిజకులాచారానుసారముగా మహావైభవముతో నుద్వాహము లొనర్చి యల్లుండ్రను గూఁతుండ్రనాశీర్వదించి సంభావనా సంభావితులఁజేసి వారివారి గృహముల కంపివేసెను. తరువాత గుమారుఁడగు కపిలమహర్షి నేకాంతమునకుఁ దీసికొనిపోయి వందనమాచరించి “మహాత్మా! పరమేశ్వరుఁడ వగు నీవు నీమాటలు తప్పకుండ నాగృహమునఁ బుట్టితివి. సంసార చక్రపరిభ్రామ్యమాణుల మగుచు గ్రామ్యుల మగు మా వర్తనములు గణింపక యనుగ్రహించి నాకు ముద మొదవించితివి. దాన నేను ఋణత్రయములనుండి తొలఁగితిని. ఇఁక యోగసమాధి నిరతి నీ పాదారవిందములు డెందమునఁజేర్చి శోకములఁ వాసి యేకాంతస్థలమున సంచరించెద" నని పలికెను. అంతఁ గపిలమహర్షి “వరమునీంద్రా! నిర్హేతుక దయాగుణమున నా వాక్యముల ననుసరించి నీయింటఁబుట్టితిని. నేను నన్మునివేషము ధరించుట నాకొఱకుఁ గాదు. మహాత్ములైన మునులకుఁ దత్త్వబోధము చేయుటకే యని తెలిసికొనుము. సన్న్యస్త సకల కర్ముండవై నన్నే భక్తితో