పుట:Maharshula-Charitralu.firstpart.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఋష్యశృంగ మహర్షి

59


దద్భుత సుందరాకారు లగు మునిబాలురు వచ్చిరనియు వారు కట్టిన చీర లతిమృదులము లనియు, వారిశరీరములు రమ్యసౌరభయుతములనియు వారి కలకూజితము లానంద ప్రదము అనియు నం దొక మునిబాలుఁడు తన్నుఁ గౌఁగిలించుకొని నిజాస్య మాసన్నముచేసి యొకమృదుమధురశబ్దము చేసె ననియుఁ జెప్పి వారితోఁ దపముచేయుట కిష్టపడియుంటి నని పలికెను. విభాండకుఁ డవి రాక్షస మాయలనియు వారిదానముణు వర్జనీయము లనియుఁ ప్రబోధించెను.

మఱునాఁడు విభాండకుఁ డెప్పటియట్ల వన్యపలముల కరిగిన వెంటనే వేశ్యాంగన లరుదెంచి ఋష్యశృంగుని డాయుడాతఁ డమితానందము నంది వారితో వారివనమున కేఁగుదేర నంగీకరించెను. వారును ధమకోరిక యీడేఱినందుల కానందభరితులై మచ్చికతోడను మేలములగు ముద్దులతోడను నా ముగ్దమౌని నంగదేశనమునకుఁ దోడ్కొ ని వచ్చిరి. అతఁడు రాజాశ్రయ మగు దివ్య భవనమును జేరఁగనే యాతని నివాసశక్తిచే సర్వజన ప్రమోదముగాఁ గుంభవృష్టి కురిసెను. రోమపాదుఁ డమితానందము నంది శాంత నాతని కిచ్చి వివాహము చేయువెఱ నాలోచించుచు నాతనిఁ బూజించుచుండెను.

శాంతా ఋష్యశృంగుల వివాహము

ఒకనాఁడు ఋష్యశృంగుఁడు పరమసౌందర్యనిధియు వినయవిద్యావివేకశీలయు నగు శాంతను జూచి యామె యద్వితీయ సౌందర్యమునకు ముగ్ధుఁడై రోమపాదునిఁ బిలిచి యామె యెవ రని యడిగెను. రోమపాదుఁ డామె దశరథునిపుత్త్రి యనియు దశరథుఁడు దనమిత్త్రుఁ డగుట నామెను బెంఛుకొనఁ దీసికొని వచ్చితి ననియు జెప్పెను. అంత ఋష్యశృంగుఁడు దశరథుని వృత్తాంతమడిగెను. రోమపాదుఁ డాతని చరిత్రమును దెల్పి తొల్లి దశరథుఁడు శాంతా స్వయంవరముఁ జాటుటయుఁ బరశురాముఁ డరుదెంచి యెల్లెరు రాజులతో