పుట:Maharshula-Charitralu.firstpart.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

50

మహర్షుల చరిత్రలు


దండ్రి యౌవనమున భర్త వార్దక్యమున సుతుఁడు రక్షించును గాని స్త్రీ యెన్నఁడు స్వతంత్రించి యే కార్యమును జేయరా దని యుపదేశించెను. కాని, యామె మన్మధభాధావివరణము చేయుచుఁ దనశక్తి ప్రభావముచే ననుక్షణాతి శయసౌందర్యశోభిత యయ్యెను. ఐన, నష్టావక్రుఁ డేమాత్రమును జలింపక నిర్లిప్తుఁడై యుండెను. అప్పుడామె స్వస్వరూపమునఁ గాననై తాను వదాన్యుని ప్రార్ధనమున నష్టావక్రుఁ బరీక్షింప నంతయుఁ బన్నినయుత్తర దిశాంగన నని చెప్పి యాతనిదీక్షావిజయమున కెంతయు నభినందించి సుప్రభాకన్యను వివాహమై త్రిభువన వినుతముగా గృహస్థాశ్రమమును నిర్వహింపుమని యాశీర్వదించెను. అష్టావక్రుఁడట్లు పరీక్షావిజయమంది వదాన్యు నింటికేఁగి యావద్వృత్తాంతము నివేదించేను. వదాన్యుఁడు నానందించి వివాహముహూర్త మేర్పఱిచెను. ఏకపాదుఁడు సుజాతయుఁ గుమారుని విజయమున కభినందించి యానందముతో సబంధుమిత్త్ర పరివారముగా నష్టావక్రుని వివాహమునకుఁ దరలివచ్చిరి. సుప్రభాష్టావక్రుల వివాహము పరమవైభవముతో జరిగెను. కుబేరాదులు వివాహము చూడవచ్చిరి. దేవతలు వధూవరులపైఁ బుష్పవృష్టిఁ గురిసిరి, కిన్నరు లాకసమున నాట్యమాడిరి. బ్రహ్మర్షులు వధూవరుల నాశీర్వదించిరి. అష్టావక్రుఁడు పిమ్మట సుప్రభాసహితుఁడై యాశ్రమమున కేఁగి తపోవృత్తినుండెను.[1]

అష్టావక్రుఁడు రంభాదులమ శపించుట

అష్టావక్రమహర్షి గృహస్థాశ్రమము సద్వితీయముగా నాదర్శ ప్రాయముగాఁ గడపి సుప్రభాదేవిమూలమున నుత్తమమగు పుత్రసంపదఁ బడసెను. తరువాత, నాతఁడు జలమధ్యముఁ జేరి ఘోర తపస్సు చేయుచుండెను. ఒకనాఁడు రంభాద్యప్పరస లాతనికడకు వచ్చి నమస్కరించిరి. "మీరేల వచ్చితి” రని వారి నాతఁ డడిగెను.

  1. భారతము - అనుశాసనికము.