పుట:Maharshula-Charitralu.firstpart.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అగస్త్యమహర్షి

15


చున్న యాగమును బూర్తిజేసి శ్రీరాముని బూజించి యొక విచిత్ర రత్నమయనవ్యవిభూషణము నొసఁగఁగా శ్రీ రాముఁడది యెట్లువచ్చె ననియు దానిని దానుగ్రహింపవచ్చునా యనియు నగస్త్యు నడిగెను. అగస్త్యుఁడు శ్వేతుఁడనురాజర్షి వృత్తాంతముఁ జెప్పి యాతఁడే యా భూషణమును దన కిచ్చెననియు నృపాలున కెవ్వరేమిచ్చినను గై కొనవచ్చు ననియుఁ జెప్పెను. శ్రీరాముఁడానందముతో దానిం గై కొని ధరించి దండకారణ్యవృత్తాంతము నగస్త్యునివల్ల, విని యగస్త్యునిఁ గీర్తించి యయోధ్యకుఁ బోయెను. [1]

అగస్త్యమహర్షి నహుషుని శపించుట

తొల్లి యొకానొకప్పుడు సహుషుఁ డనురాజు బ్రహ్మ విదుఁడై నూఱుయజ్ఞములుచేసి యుత్తములగు కుమారులఁగని దేవత్వము నొంది, యింద్రుఁడు విశ్వరూపునిఁ జంపినపాపమునకు వెఱచి పాఱిపోఁగా దేవతల యభిమానమును జూఱగొని యింద్రపదవి నధిష్టించెను. కాని, కాలక్రమమున నైశ్వర్యమదాంధతయు భోగలాలసతయు వృద్ధికాఁగా సహుషుఁడు శచీదేవితో పొత్తు నాకాంక్షించెను. ఉత్తమ పతివ్రతయగు శచీదేవి యుపాయ మాలోచించి ముని వాహనుఁడై తనకడ కేతెంచినచో నాతని యభీప్సితముఁ దీర్తునని యాతనికి వర్త మూనమంపెను. నహుషుఁడును వివేక విహీనుఁడు నార్య వృత్తిరహితుఁడు నై సహస్రోత్తమ బ్రాహ్మణ ధృతమైన బ్రహ్మరథమున నెక్కి బ్రాహ్మణానమాస మొనర్చి ప్రసంగ వశమున గోసంప్రోక్షణమందుఁ జెప్పఁబడిన బ్రాహ్మణములైన మంత్రములు తనకుఁ బ్రమాణములు కావని ఋషులతో వాదించెను. పూర్వాచార్యుల మంత్రములను నిందించుట యజ్ఞానమని యగస్త్యుఁ డనఁగా నహుషుఁ డాతనిఁ దలపైఁ దన్నెను. అగస్త్యమహర్షి యట్టిఘోరదుష్కృతమును జూచి యూరకుండ లేక

  1. రామాయణము.