పుట:Maharshula-Charitralu.firstpart.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14

మహర్షుల చరిత్రలు


జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమోనమః |
నమో వమస్సహస్రాంశో ఆదిత్యాయ నమోనమః ||
సమఉగ్రాయ వీరాయ సారంగాయ నమోనమః |
నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమోనమః ||
బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే|
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః ||
తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామి తాత్మనే |
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాంపతయే నమః ||
తప్త చామీక లాభాయ వహ్నయే విశ్వకర్మణే |
నమః తమోభి విఘ్నాయ రుచయే లోకసాక్షిణే ||
నాశయత్యేషవై భూతం త దేవ సృజతి ప్రభుః |
పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః it
ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః |
ఏష చైవాగ్నిహోత్రంచ ఫలం చైవాగ్నిహోత్రిణామ్ ||
వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవచ |
యానికృత్యాని లోకేషు సర్వఏష రవిః ప్రభుః " ||

ఈ ఆదిత్యహృదయ పారాయణముచే శ్రీరాముఁ డచిర కాలముననే శత్రునిర్మూలనమున విజయలక్ష్మి నందఁగల్గెను.

శ్రీరాముఁడు - రావణుని జయించిన పిమ్మట సయోధ్యాపురమునఁ బట్టాభిషిక్తుఁ డైనతఱిఁ గణ్వాది మహర్షులతోనగస్త్య మహర్షియు శ్రీరాముని జూడ నేఁగి యాతని సంస్తుతించిన, శ్రీరాముఁడు రావణాదుల జనన విజయాది వృత్తాంతముల నడుగఁగా నగస్త్యుం డాతని కెల్ల వినిపించెను. మఱియొకప్పుడు సీతాదేవి వాల్మీక్యాశ్రమమునఁ గుశలవులఁ గన్న పిదపఁ బుష్పకవిమానారూఢుఁ డై పోవుచు శ్రీరాముఁడగస్త్యాశ్రమమున కేతెంచెను. ఆగస్త్యమహర్షి తాను జేయు -లు ని