పుట:Maharshula-Charitralu.firstpart.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అగస్త్యమహర్షి

9


యతలతో బ్రహ్మనడిగెను. సృష్టికర్త "మహనీయ తపోనిధీ! నీవంటి యుత్తమ మహర్షుల మూలముననే కదా విశ్వస్థితి సాధ్యమైనది! మహర్షి కల్పులనపరతము మాకుఁ బూజ్యులు స్మరణీయులుఁ గదా! ఇఁక నాపచ్చినపని యొకటి కలదు. పూర్వ మొకప్పుడు కవేరుఁడను రాజర్షి పరమశివునిఁగూర్చి మహాతపస్సు చేయఁగా నాతఁడు పత్యక్షమై కవేరునికోరిక యడిగెను. కవేరుఁడు భయభక్తి తాత్పర్యములతోఁ దనకు ముక్తినిమ్మనికోరెను. ఈశ్వరుఁ డాలోచించి యాపని విరించి సిద్దింపఁ జేయును గాన నాతనిఁగూర్చి తపింపుమని చెప్పి వెడలిపోయెను. కవేరుఁ డానందముతో నన్నుగుఱించి ఘోర తపస్సు చేయఁగా నేనుబ్రత్యక్షమై యాతని వాంఛా సంసిద్దికి నా కుమారియగు విష్ణుమాయ యాతనికిఁ గూఁతురై జన్మించునని చెప్పిపోతిని. తరువాతఁ గవేరునకుఁ బుత్త్రిక జన్మించినది. ఆమె యిపుడు తండ్రికి ముక్తినొసఁగుటకై యుగ్రతపస్సు చేయుచున్నది. ఆమె యొక యంశ మే నీ భార్యయగు లోపాముద్రగాఁ దొల్లి నేను సృష్టించితిని. లోపాముద్రను నీవు వివాహమాడితివి, ఈ కవేరకన్యను సైతము నీవు వివాహమాడవలయును. దానివలన నీకు నామెకును శ్రేయమగు" నని వేఁడుకొనెను. అగస్త్యుఁడు "చతుర్ముఖా ! నీవింతగాఁ జెప్ప వలయునా? నీ యాజ్ఞ నా కవశ్యానుష్టేయము కదా!" యని విరించిని బంపివైచి యగస్త్యుఁడు. కవేర కన్యాన్వేషణమునకై బయలుదేఱెను.

తపః కార్శ్యముచే దివ్యసుందరముగ నొప్పు కవేరకన్య నగస్త్యుఁడు సమీపింప నామె యగస్త్యుని పాదారవిందములపైఁ బడి, “మహాత్మా! త్రిలోకపూజ్యులగు తమ దివ్యదర్శనమునఁ బునీతనై తిని. తమ కృపాకటాక్షములఁ బఱిపి నాయాతిథ్య మంగీకరించి ననుఁ గృతార్థను జేయవే ! "యని వేఁడుకొనియెను. అగస్త్యుడు “తరుణీమణి1 నే నేతత్కార్యార్ధమే నిను వలచి వచ్చియున్నాను. కాన