పుట:Maharshula-Charitralu.firstpart.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8

మహర్షుల చరిత్రలు


ఇరువదివేల పాడియావులు, ఇరువదివేల గద్దెల బంగారము నిచ్చెను. అగస్త్యుడు ఆ ధనసంపదలతో రాజులతో నిండిన రథమును గుఱ్ఱములు తాల్చి తనయాశ్రమమునకుఁ దత్క్షణమే బోయి చేరెను. రాజర్షు లగస్త్యుని వీడ్కొని చనిరి.

వాతాపి నట్లును బ్రాహ్మణ హంతయగు నిల్వలుని దరువాతను నగస్త్యుఁడు రూపుమాపి 'వాతాపీల్వలమర్దనుఁ' డను నామమును ధరించెను. అగస్త్యుఁ డా ధనముతో లోపాముద్ర కోరిన సమస్తాభరణములు నొసఁగి యనేక రమ్యవస్త్రములిచ్చి పిమ్మట బదుగురఁ బోలుసుతులు నూర్వురు కావలెనా? సూర్వురఁ బోలు సుతులు పదిమంది కావలెనా? లేక వేవురకు సరిపడు నొక్క కుమారుఁడు కావలెనా? యని యాదరముతో భార్య నడిగెను. ఆమె వేవురఁ బోలెడునాని నొక్కనిఁ గోరికొనెను. ఆమెకోరిక యనుగ్రహించి యగస్త్యుఁడు తపోవ్రతమున నుండెను. పిమ్మట లోపాముద్ర గర్భవతి కాఁగాఁ గాలక్రమమున నామెకు ననవద్యుఁడగు దృఢస్యుఁడను కుమారుఁ డుదయించెను. దృఢస్యుఁడు పెరిగి పెద్దవాఁడైన పిదప నాతనికి దేజస్వి యను కుమారుఁడు పుట్టెను. ఈ ప్రకార మగస్త్యుఁడు పుత్రపౌత్ర వంతుఁడై పితరులకుఁ బుణ్యలోక గతుల నొసగూర్చెను. [1]

అగస్త్యుఁడు కవేరకన్యను వివాహమాడుట

తొల్లియొకనాఁడు బ్రహ్మదేవుఁడగస్త్యాశ్రమమున కేతెంచెను. అగస్త్యుఁడు శ్రద్ధాభక్తులతో విరించి కర్ఘ్యపాద్యాదు లొసంగి సుఖాసీనుఁజేసి “చతురాననా! మహా తపః ప్రభావముననైన నలభ్య దర్శనుఁడ వగునీవు నాయింటి కేతెంచుట నాయదృష్టము. మహాత్ము లూరక రారుగదా ! ఇట్లు నీవు నా పైఁ గటాక్షము చూపి నందులకు సదా కృతజ్ఞుఁడను. ఏమి యానతి! " యని వినయవిధే

  1. భారతము - ఆరణ్యపర్వము.