పుట:Maharshula-Charitralu.firstpart.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దధీచి మహర్షి

135


దధీచి దేవతల యస్త్రశస్త్రములఁ మ్రింగుట

ఒకప్పుడు రాక్షసులు విజృంభించి దేవతలపై దండెత్తి వారి నోడించి యిఁక నెన్నఁడు వారు తిరిగి తమ కపకృతి యొనరింపఁ జాలకుండుటకు వారివారి యస్త్రశస్త్రములను లాగివైచు కొనుచుండిరి. దేవతలు నుపాయాంతర మాలోచించి దధీచి మహర్షి కడఁ దమ యస్త్రములు దాఁచి యుంచినచోఁ బ్రమాదము తప్పునని యెంచిరి. అంత నింద్రాది దేవతలెల్లరును సస్త్రశస్త్రసమేతులై దధీచి మహర్షి కడ కేఁగి యాతని పాదముల పైఁ బడి తమ దురవస్థఁ దెలిపికొని తమ యస్త్రములను దాఁచి పెట్టుమని యర్ణించిరి. దధీచి జాలిగొని యట్లంగీకరించి వారి యస్త్రముల నెల్ల గ్రహించెను! దేవతలును దమ యస్త్రభద్రత కానందించి వెడలిపోయిరి త్వరలో వారికిని రాక్షసుల యుపద్రవము తొలఁగిపోయెను. కాని, వారు భోగలాలసులై దధీచికడకు వచ్చి యస్త్రములను గ్రహింప వాలస్యము చేయుచుండిరి. దధీచి వాని నన్నిటినిఁ జిరకాలము దాఁచియుంచఁ జాలక వానిపై జల మభిమంత్రించి వానినెల్ల నొక్కపరి మ్రింగివేసెను. అతని తపఃప్రభావమున నవియెల్ల జీర్ణమై యాతని రక్తనాళములలో నెముకలలోఁ జేరిపోయెను.

అంతఁ గొంతకాలమునకు దేవతలు వచ్చి దధీచి నస్త్రము లిమ్మని కోరిరి. దధీచి తాను చేసినవని చెప్పి వారి యాలస్యమే దాని కారణ మని పలికెను. దేవతలు భయగ్రస్తులై యెట్లో తమ యాయుధము లిమ్మని కోరిరి. దధీచి యవి జీర్ణములై యెముకలకు వ్యాపించిన వనియు నవసరమైనచోఁ దన్నుఁ జంపి తీసికొండనియు ననెను. దేవతలు నాతనిఁ జంపు శక్తిలేక చంప భయభ్రాంతులై దీనవదనులై యేడ్వఁ జొచ్చిరి. దధీచి వారి నూఱడించి " నేను మీకొఱకే జీవించుచున్నాను. ప్రస్తుతము మీ కాయుధము లవసరము లేదుకదా! మీ కత్యావశ్యక మైననాఁడు రండు. నా దేహము నేనే