పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

82

మహర్షి దేవేంద్రనాధశాకూర్ స్వీయచరిత్రము.


రంభించిరి. అందువల్ల 'నేమియు తెలియలేదు. నేనప్పుడిట్లంటిని: “మీ రెండు దళముల గౌరవము కాపాడ బడినది గావున ఇప్పుడొక్క దళమువారాగి ఒకదళమువారు పఠింపుడు, "మొదటశుక్లయజు ర్వేదమును, పిమ్మట కృష్ణయజు ర్వేదమును పఠింపుడు. ” యజు జుర్వేదము పఠించు సరికి మిక్కిలి ఆలస్యమయ్యెను. సామ వేద బాలురు సామగానము వినిపించుటకు విశేష ఉత్సాహముతో నిండియుండిరి. యజు ర్వేదమాలస్య మగుట చూచి విసుగుచెందుచుండిరి. అది ముగిసినపిమ్మట వెంటనే వారు నాముఖము వంక చూచిరి. “పఠింపుడు” అంటిని. వెంటనే వారిరువురుసు మధుర స్వరముతో, “ఇంద్ర ఆయాహి” అని సామగానము చేయజొచ్చిరి అంత మధురమైన సామగానము మున్నెన్నడును నేను వినియెరుగను. చిట్ట చివర అధర్వ వేదము చెప్పిరి. అంతత సభముగిసెను.


బాహ్మణులు సదయులై సభానంతరమున నాతో, "యజమాని అనుగ్రహించి బొహ్మణ సంతర్పణ గావించినచో ఒక వనములో మన మందిరము కలసి భుజం పవచ్చును,” అనిరి. నేను హరిమాట కేమియు ప్రత్యుత్తరమియ్యక మునుపే తారక నాధుడు నా చెవిలో “ఈ బ్రాహ్మ ణులకింకను విందా ? ఒక్కొక్కరొక్కక్కచోట కూర్చుండి "వేర్వేరు భోజనము లారంభింతురు. ఇన్ని యేర్పాటులు చేయవలసి యుండును. అట్లు చేసినను ఏమి ప్రయోజనము? మన యూళ్లలో బాహ్మణ సంత ర్పణ చేసినట్లుండదు. అక్కడ మనము వండి పెట్టిన నందరు కలసి భుజి తురు” అనెను. మరియొక బాహ్మణుడు వచ్చి " త్వంలో నొక యజ్ఞము గావింపనున్నాము. తమరు చూడనిచ్చగింతులేని దయచేసి చూడవ చ్చును" అని చెప్పెను. 'నేనీ కార్యముమీద మాత్రమే వచ్చియుంటినని చెప్పితిని. ఆతడు "మాయజ్ఞములో జంతువులను చంపము. పిండితో " పశువులను నిర్మాణము చేసి చంపుదుము” అనెను. మరియొక ప్రక్క నుండి కొందరుబ్రాహ్మణులు “జంతువులను చంపకుండ యజ్ఞ మేమిటి?