పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదునేడవ ప్రకరణము.

83


వేదములో “ స్వేతం ఆల భేతా"... తెల్ల మేకను చంపవలెను.--అని యున్నది” అనిరి. యజ్ఞమును గూర్చిగూడ భేదాభిఫాయము లున్నవిగదా యనుకొంటిని. ఎట్లయినను బాహ్మణులు సంతుష్ట చెంది ఇళ్ళకు తిరిగి వెళ్లిరి.


నామధ్యాహ్న భోజనము కొరకొక శుద్ధ సత్వ బాహ్మణుడునాకు బియ్యము కూరలు తెచ్చియిచ్చెను. తిరిగి మధ్యాహ్నము మూడుగంటలకు 'కాశిలోని పండితులు, శాస్త్రజ్ఞులు శాస్త్రాలోచన కొరకు మాన్మందిరము వచ్చిరి. వేదములలోని విజ్ఞాన కాండ కర్మకాండలు, ఇంకను ఇతరములైన శాస్త్రములు తర్కింపబడెను. ప్రసంగవశమున నేను వారిని "యజ్ఞములో పశువులను చంపుట వేదవిహితమా” యని అడిగితిని. పశువులను చంపనిదే యజ్ఞము చేయుటకే వలనుపడ దనివారు ప్రత్యుత్తర మిచ్చిరి. నేనీ ప్రకారముగా పండిత గణముతో శాస్త్రాలోచన జరుపుచుండగా మందిరమునుండి వారి బంధు వర్గములోనొకరు నావద్దకు వచ్చి, “మహా రాజుగారు తమరిని దర్శింపగోరుచు న్నార”ని చెప్పెను. ఈ యాహ్వానమునందు కొంటిని. అప్పటికి సభచాలింప బడినది. బాహ్మణులు సంభావన తీసికొని ఇండ్లకు వెళ్ళి పోయిరి.అందులో ఒక శాస్త్రి, “సాధారణముగా ఈయూరిలో శూద్రునివద్దదానములు గైకొనుట యనగానే ఒడలు గరిపొడుచును. కానినీదానములు మేమతి సంతుష్టితో గ్రహించితిమి” అనెను.


మరునాడా రాజబంధువు వచ్చి తనతో నన్ను కాశికి ఆవలియుడ్డున నున్న 'ఆమనగరమునకు గొనిపోయెను. అప్పుడు రాజుగారింటి వద్ద లేకపోయిరి. ఆ రాజ బుధువు నాకు రాజుగారి ఐశ్వర్యములు చూపదొ డగెను. గదులన్నియు దుకాణములవలే బొమ్మలతోను, అద్దములను, తివాసులతోను, తెరలతోను, మేజాలతోను, కుర్చీలతోను నిండియు డెను. నేనిటునటు చూచుచు తిరుగుచుండగా రాజుగారీ యశస్సునుగా