పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదు నేడవ ప్రకరణము.

81


హ్మచారులు, అయినను "చెవులకు కుండలములుండెను. వానివల్ల వారి ముఖములకు విశేష శోభకలిగెను.

వాణీశ్వరుడు చందనపు గిన్నె తీసికొని వెళ్ళెను. తారకనాధుడు పుష్పమాలలు పట్టుకొని యుండెను. రామనాధుడు వస్త్రములు చేతబూని యుండెను. ఆనంద చంద్రుడు అయిదువందల రూప్యములు పట్టుకొనియుండెను. వాణీశ్వరుడు బ్రాహ్మణుల లలాటముల చందనమలదిన వేంటనే తారక నాధుడు వారి కంఠముల పుష్పమాల లుంచు చుండెను. పిమ్మట రామనాధుడొక్కక్క నేతవస్త్ర మిచ్చుచుండెను.కడపట ఆనందచంద్రుడు వారి చేతులలో రెండేసి రూపాయ లుంచుచుండెను. ఈ విధముగా ప్రతి బాహ్మణునకును ఒక బొట్టు, ఒక మాల, ఒక ధోవతి బహుమానము లభించెను. బాహ్మణులీ పూజను గ్రహించి పరిహృష్టాంతరంగులై, “ఈయజమాను డెంత శ్రద్ధావంతుడు ! ఇదివ రాకెవ్వరును కాశిలో నిట్లు చేసియుండ లేదు,” అని పలుక జొచ్చిరి.


“ఇకమీరు వేదములు గానముచేసి నన్ను పవిత్రునిగావింపుడు,” అని హస్తములు జోడించి సవినయముగా పల్కితిని. ఋగ్వేద బ్రాహ్మణులందరును కలసే అత్యుత్సాహముగా నుచ్చైస్వనములో, “అగ్నిమీడే పురోహితం” అని వర్ణింప నారంభించిరి. తోడనే యొక బాహ్మణుడు, “యజమాని నన్న నమాన పరచుచున్నాడు. " అని కేక లిడెను, అది యెట్లని నేనడిగితిని. “కృష్ణయజుర్వేదము ప్రాచీనమైనది. దానిని ముందు సన్మానించుట లేదు. ముందది పఠింపఁబడుట లేదు. మాకిది యవమానముగా నున్నది”, అనెను. “ఈతగాదా మీలో మీరు తీర్చుకొనుడ” ని సేనంటిని. ముందెవరు పఠించుటయనియిరు పక్షములవారికి వివాదము సంభవించెను. దీనికంతము లేనట్లు తోచి, యిద్దరును ఒక్కసారే ప్రారంభింపుడని యాజ్ఞాపించితిని. దీనికి వారు సంతుష్టి చెందియిరుపక్షములవారును ఉచ్చైస్వనముతో గోలగావించుచు పఠింపనా II