పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదు నేడవ ప్రకరణము.

79


యానుసారముగా Carr Tagore & Co. ఈనూతన ప్రణాళిలో నిబద్ధ మయ్యెను. 'నేనతని యభిప్రాయములను మెచ్చుకొనుటచే నతడుత్సా హము పొంది కంపెనీ వాణిజ్య కార్యమంతయు తన యావచ్ఛక్తితో శ్రద్ధాపూర్వకముగా యధాసాధ్యముగా చూడనారంభించెను.


పదు నేడవ ప్రకరణము.

ఋగ్వేదము, యజుర్వేదము, సామ వేదము, అధర్వ వేదము, శిశు, కల్పము, నిరుక్తము, ఛందస్సు అన్నియు అ శ్రేష్ఠ విద్యలనియు, ఏవిద్య ద్వారా పరబ్రహ్మమును తెలిసికొనగలుగుదుమో" అదియే శ్రేష్ట విద్యయనియు ఉపనిషత్తుల యుపదేశమువల్ల నేర్చికొంటిమి. అతిశ్రద్దాపూర్వకముగా నీ సంగతి గ్రహించితిమి. మాలక్ష్యముతో నిది పూర్తిగ నేకీభవించి యున్నది. ఈలక్ష్యమును జన సామాన్యమునకు ద్ఘోషింపింపవలెనను యభిప్రాయముతో 'తత్వబోధినీ' పత్రిక యొక్క. ద్వితీయకల్పము లోని ప్రథమభాగము నుండియు దాని శిరోభాగమున నీక్రింది వేదవాక్యము ప్రకటింప నారంభించితిమి.


"అపరాఋగ్వేదోయజుర్వేదః సామవేదో
ధర్వ వేదః శిక్షాకల్పో వ్యాకరణం
నిరుక్తంఛందో జ్యోతిషమితి | అధపరా
యయా తదక్షుర మధిగమ్య తేః!"


దీనింబట్టి వేదములలో పరావిద్య అపరావిద్యయను రెండు భాగములున్న వని గ్రహించితిమి. ఈ రెండువిద్యల విషయములును విపులముగా గ్రహించుటకు గాను 'వేదానుసంధానములో ఉత్సుకుడ నైతిని.'నేను స్వయముగ "కాశికిపోవుటకు సిద్ధపడితిని, లాలా హజారిలాల్ తో,