పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

78

మహర్షి దేవేంద్ర నాధశాకూర్ స్వీయచరిత్రము


జీతగాండ్రగా నుంచినచో మనమన్ని సందర్భములలోను వారికి జీతముల నివ్వకతప్పదు, పనిలో వారికంత శృద్ధియునుండదు. కావుననీమా ట నారంగీ కారము లేదు” అంటిని. అతడిట్లు వాదింప దొడగెను. కాని దొరలకు స్వంత ఆస్తి ఏదియు లేదు. ఎప్పటి కైనను వాణి జ్యము పతనము చెందినచో అప్పుల వాండ్రు, మన ఆస్తినే పట్టు కొందురు. అన్ని వ్యవహారములు మనమే చక్క బెట్టు కొనవలసి యుండును. అప్పులు తీర్చుటకు మన భూములన్నియు అమ్ముకొన వలసి యుండును. ఇప్పుడు మనలాభములను మాత్రము పంచి కొందురు గాని నష్ట సమయములో నష్టము భరించుటకు మాత్రము వారి కేమి యునుండదు. లాభము లనుభవించిన పిమ్మట వారు వెడలుదురు, మనము మాత్రము నష్టము లెక్కించు కొనుచుందుము. ఇప్పుడు కూడ ఏమి జరుగుచున్నదో చూడుము. మన జమీందారీ సొమ్మంతయు కంపెనీకై వెచ్చించు చుందుము. మనమెంత సొమ్మిచ్చిన వ్యాపారము నకంత యాకలి హెచ్చుచుండును. దాని రాక్షసక్షుధ యింకను తీరదు. కానీ ఆంగ్ల భాగస్టులొక్క పైసనైను నివ్వరు. ఇట్లనుటవిని అతని చాక చక్యమును ప్రశంసచేసి కంపెనీ కర్తృత్వ భారమంతయునాతని పై నుంచితిని. ఈ విధముగ నేను బాహ్మసమాజమునకు పనిచేయు టకును,

ప్రచారము చేయుటకును కొంత తీరిక చేసికొంటిని.


ముగ్గురన్నదమ్ములము కంపెనీ యొక్క సంపూర్ణాధికారము సంపాదిం చితిమి. మునుపు మాభాగస్థులుగా నుండిన ఆంగ్లేయులకు ఉద్యోగము లిచ్చితిమి. వారివారి కిదివరలో నుండిన భాగములను బట్టి మాసమునకు కొందరకు వేయేసి రూపాయలు కొందరకురెండేసి వేల రూపాయలు వేతన మిచ్చుచుంటిమి. అందుచే నీయేర్పాటునకు వారంగీకరించ వలసి వచ్చెను. ఇదివరలో వారువారుచేయు చుండిన పనులను చేయుచుండిరి. కాబట్టి గిరీంద్రుని అభిప్రా