పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

80

మహర్షి దేవేంద్రనాధ ఠాకూర్ స్వీయచరిత్రము


అంచీలమీద పాలకీ నెక్కి కాళికి ప్రయాణమైతిని (1843 అక్టోబరులో) అతికష్టముమీద పదునాల్గు దినముల కచట చేరితిమి. గంగా తీరమున “మాన్మందిరము' నావాసస్థానము చేసితిని. "నేనచటకు వచ్చుట చూచి నేను పంపిన విద్యార్థులు విశేషాహ్లాదితులైరి, వారణాసీపుర విశేషము లను, వారి వారి స్వీయావస్థలను తెలిసికొంటిని. కాశిలోని ప్రధాన వేద జ్ఞులను, బ్రాహ్మణులను, శాస్త్రికులను నిమంత్రణ చేసి , " నేనిక్కడ నొక సభ గావించెదను. 'వేదములనన్నింటిని యాలకించి అర్ధమును గ్రహింపవ లెనని యున్నది. రామనాధా ! నీవు మీఋగ్వేద గురువుతో ఈపురములో *నున్న ఋగ్వేద బ్రాహ్మణులనందరిని పిలువమని చెప్పుము. వాణీశ్వరా ! యజుర్వేద బ్రాహ్మణులనందరిని పిలువు మని యాయజు ర్వేదగురువుతో చెప్పుము, తారక నాధా! సామవేద బ్రాహ్మణుల నందరిని పిలువమని మీసామ వేదగురువుతో చెప్పుము. ఆనందచందా! అధర్వణవేద 'బాహ్మణులనందరిని పిలుపుమని మీఅధర్వణవేదగురువుతో చెప్పుము” అంటిని. ఈప్రకారముగా కాశిలోని బా బాహ్మణులందరును నిమంత్రణ గావింప బడిరి.


వేదము లన్నియు వినుటకు ఎవరో బంగాళా దేశమునుండి ఒక శ్రద్ధావంతుడగు యజమానుడు వచ్చియున్నాడని కాశిలో పదంతి పుట్టెను. విశ్వేశ్వరాలయపు పండా నావద్దకువచ్చి విశ్వేశ్వరాలయము నకు నన్ను రమ్మని ఆహ్వానించెను. “ఇప్పుడున్నది విశ్వేశ్వరాలయ ములో కాక వేరెక్కడ? ఇంకెక్కడికి రమ్మనెదవు?” అంటిని. నేను కాశీకి వచ్చిన మూడవదినము ప్రాతః కాలము మాస్మందిరము లోని విశాలమైన సావడియంతయు 'బాహ్మణులతో నిండిపోయెను. వారినంద రిని నాలుగు పంక్తులుగా కూర్చుండ బెట్టితిని. బుగ్వేదులు రెండు పంక్తులు,అథర్వ వేదులొక పంక్తి, సామ వేదమున కిద్దరు బాలకులు మాత్రముండిరి, వీరిని నాపార్శ్వమున కూర్చుండ బెట్టుకొంటిని. వారునూ తన బ్ర