పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదునాల్గవ ప్రకరణము.

63



హృష్టాంతరంగుడై యుండెను. అతడు సర్వదా మందస్మిత వదనముతో నుండెడివాడు. అతడెన్నడు నాసొంగత్యము విడువక యుండెను. అతనితో " ధర్మచర్చ సలుపుట నాకు మిక్కిలి యిష్టముగానుండెను. నేనతనిని మాకుటుంబములో ఒకనివలెనే గణించుచుంటిని.


నాకుటుంబముతో ప్రయాణమునకు బయలు వెడలినప్పుడు మాతో రాజా నారాయణ బోసుని కూడ తీసికొని వెళ్ళితిని. అతడు పడవలో నా చెంతనుండెను. నాభార్యా పుత్రులందరును డింగీలో నుండిరి. ఉత్సాహముతో ప్రయాణమునకు బయలు దేరితిమి. శ్రావణమాస ప్రబల స్రోతము మాకు విపక్షముగనుండెను. దానికి ప్రతికూలముగ నతికష్టముతో ముందుకు నెమ్మదిగ సాగుచుంటిమి. హుగ్లీ (huggli), చేరుటకు మూడు నాలుగు దినములు పట్టెను. రెండు దినముల పిమ్మట “కాల్నా ' చేరుసరికి చాలదూరమే వచ్చితిమనుకొంటిమి. ఈవిధముగా పోవుచు ' పాటులీ' దాటిన పిమ్మట ఒక నాడు నాలుగుగంటల వేళ రాజనారాయణ బాబు, “ నేటికి నీదిన చర్య ] వ్రాత (Diary) చాలించుము. ప్రకృతివి శేషదీప్తి శోభించుచున్నది. నడువుము, పడవటాపు” మీద కెక్కి కూర్చుందము,” అంటిని. “ఇంక చాల పొద్దున్నది. ఈలో పుగానా' డైరీ”లో వాయుటకు ఇంకా ఏమి సంఘటించునో ఎవరి కెరుక " అని అతడు పత్యుత్తరమిచ్చెను. ఈ విధముగ నతనితో మాట్లాడు చుం డగనే యొక కారు మేఘము పశ్చిమా కాశమును కమ్ముకొని వచ్చుచుం డెను. అప్పుడొక పెద్ద తుపాను వచ్చు నేమోయని భయపడితిని.తుపాను సమయమున పడవలో నుండుట క్షేమముగాదు, డింగీలోకి ” అని రాజనారాయణునిత నంటిని. పడవవాండు పడవను డింగీ పక్కకు చేర్చిరి. ఇద్దరు పడవపొండు పడవను "డింగీ లోకి పోవుదము రమ్ము," అని రాజనారాయణునితో నంటిని. పడవ వాండ్రు పడవను డింగీకి చేర్చి పట్టియుంచిరి. నేను టాపు' మీదనుండి నిచ్చెన పై కాళ్ళుమోపియుంటిని, పక్క నుండి వేరొకరు వారిపడవను లాగికొని పోవుచుం