పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

62

మహార్షి దేవేంద్ర నాధఠాకూర్ స్వీయచరిత్రము.



ఆమెకొక డింగీకుదిర్చి దానిపై నామెనుకూడ తీసికొని పోతిని. ద్విజేంద్రనాధ్ , సత్యేంద్రనాధ్ , హేమేంద్రనాధులలో నామె దానిలో నెక్కెను. రాజనారాయణ బోసుతో "నేను విశాలమైన నాస్వంత పడవనాక్రమించితిని, ద్వి జేంద్రనాధున కప్పటి కేడేండ్లు, సత్యేందనాదునకైదు, హేమేంద్రనాధునకు మూడు.


రాజు నారాయణ బోసుతండ్రి పేరు నందకీసోరీబోస్. అతడు రామమోహనునిప్రియశిష్యులలో ఒకడు. ఆయన పరిచయము నుంది ఆయన ధర్మభావము, నమభావముచూచి అమితానందము చెందితిని, అతడు 1844 సంవత్సరములో బ్రాహ్మమతమును స్వీకరించెను. నారాయణుడు' ' 'బ్రాహ్ము' అయినచో చాల బాగుండునని అతడను చుండెను, ఆయన జీవితావస్థయందు ఈయిచ్ఛసఫలత గావుంట ఆయన జూడ లేకపోయెను. ఆయన చనిపోయిన కొలది దినములలో, అశౌ చావస్థలోనే ఒక నాడుదయమున రాజనారాయణుడు నన్ను చూచు టకు వచ్చెను. అప్పటినుండియు అతనిని మిత్రునిగా గ్రహించితిని. నాటి ఆంగ్ల పండితులలో నతడు విశేష ప్రతిష్టగాంచెను. అతడప్పుడు వి శేష విద్యావంతుడని గణన కెక్కెను. అతని విద్యావినయములను ధ ర్మభావమును చూచి దినదినము నతనియెడల నాయనురాగము వృద్ధి చెంద నారంబించెను. చివరకు 1815 సం||రములో నతడు బాహ్మధర్మమును స్వీకరించెను. ధర్మభావము నందతనితో " నా హృదయము పూర్తిగకలసి పోయెను. అతడు నా కెంతయో ఉత్సాహముతో సహాయ మొనర్చుచుండెను. అప్పుడు ధర్మప్రచారము కొర కాంగ్లమున జరుపవలసిన వ్రాతకోతలన్నియు నతని కప్పగించితిని. కఠ మొదలగు నుపనిషత్తులకు నేనతనికర్దము చెప్పుచుంటిని. అతడు వాని నాంగ్లములోనికి భాషాంతరీకరించి 'తత్వబోధినీ' పతికికలో ప్రచుర్తించుచుండెను. అప్పు డతని సొంసారి కావస్థ అంతగా బాగుండక పోయినను అత డెప్పుడును ప్ర