పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

64

మహర్షి దేవేంద్రనాథ ఠాకూర్ స్వీయచరిత్రము,


డిరి. మా తెరచాపకొయ్యకు దాని తాడు చిక్కుకొనెను. మామనిషి, యొకడు ఒక్క పెద్దకర్రతో దానిని తప్పింప ప్రయత్నించుచుండెను. నేను దానివంక చూచుచుంటిని. ఆమసిపి కర్రబరువు నాపుకొన లేక పోయెను. అతని చేతులలో నుండి అది నాతల పై బడుటకు సిద్ధముగా నుండెను. అన్ని వైపులనుండియు “జాగ్రత్త, జగత్త,” యని కేకలు బయలు వెడలెను. పెద్దగల్లంతయినది. నేను సూత మింకను తెరచాప కొయ్య వంకనే చూచుచుంటిని. ఆమనిషి పాపము సాధ్యమైనంతవరకు నాతలమీద కర్ర పడకుండ ప్రయత్నము చేసెను గాని పూర్తిగమా త్రము తప్పింప లేక పోయెను. కర్రయొక్క కొన నాకంటి కొలికి వద్ద సులోచనములమీద తగిలెను. కంటికి అపాయము తప్పినది కాని సులో చనములతో నాముక్కు మాత్రము లోతుగా కోసికొని పోయెను. నా సులోచనములను లాగి వేసితిని. రక్తము డడదడ ప్రవహింపజొచ్చెను, అప్పుడు 'టాపు నుండి కిందికిదిగి కూర్చుండి రక్తమును కడుగ నారంభి చితిని. తుపానుమాట మరచితిమి. అందరమును పరధ్యానముగా నుం టిమి. పడవవాడింకను డింగీని పట్టి యేయుండిరి. ఈరీతిగా పడవను లాగికొనుచు డింగీనడచు చుండెను.


ఇంతనకస్మాత్తుగా ఒక పెద్దగాలివచ్చి డింగ్ తెరచాపకొయ్యను విరచివైచను. విరిగిపోయిన తెరచాపకొయ్య తెరతోడడను తాళ్ళతోడనుమా పడవ తెరచాపకొయ్య ఆ చిక్కుకొని పడవ టాపు' మీద పడెను.నేనింతకుముందక్కడనే కూర్చుండియుంటిని. ఇప్పుడు నాతల పై వేలాడుచుండెను. డింగీపడవను లాగికొని తుపానులోనికి జొరబడెను. రెంటిని చేర్చి పట్టుకొనియున్న మనుష్యు లింక దానిని సరిగా పట్టుకొన లేక పోయిరి. డింగీచే లాగ బడుట వలన పడవ ఒక ప్రక్క కొరిగెను. ఒక అంగుళము ఎడముగా నీటిమట్టముతో సరిగానుండెను. కొయ్యను చిక్కుకొనియున్న తాటిని తెంపుడని కేకలు బయలు వెడలెను. “కత్తి, కత్తి”