పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదవ ప్రకరణము.

47


నీవు సకల భయంకర వస్తువులకును భయంకరుడవు. సర్వభ యానకములకును భయానకుడవు. జీవులకుగతివి. పరమపావనుడవు. నీ వొక్కడవే మహోన్నతములగు పదవుల యొక్క నియంతవు. సర్వశ్రే స్థుడవు. మహారక్షుకుడవు.


'మేము నిన్నే స్మరించెదము. 'మేము నిన్నే భజించెదము. నీవు సత్య స్వరూపుడవును, ఆది కారణుడవును, అవలంబ రహితుడవును, "నేత వును, పాపసముద్రమునకు నావయును అగు నిన్నొక్కనినే శరణు జొచ్చెదము. అని ఈశ్లోకములను. ప్రణాళికలో చేర్చిన విధ మేమనిన ---


శ్యామచరణ కత్వ వాగీశుడు తాంతిక కుటుంబములో జనించినవాడు. తండ్రి కమల

కాంత చూడామణి మిక్కిలి పట్టుదలగల తాంత్రికుడు, కావున తత్వ వాగీశును 

సంస్కృత సాహిత్యములయందు ప్రవీణుడు, బ్రహ్మోపాసనా ప్రణాళికి, “సపర్యాగా” దాది మూడుశ్లోకములును చేర్చిన పిమ్మట వేదములనుండి కూడ ఏ దేని యొకటి వానికిచేర్చుటకొక హృదయంగమమగు స్తోత్రము కొరకు వెదకితిని, గాని దొరక లేదు. దీనివల్ల మనసు ప్యాకులత చెందు చుండెను. నామనోవిచా రమునకు కారణము తెలిసిన పిమ్మట తత్వ వాగీశుడు తంతశాస్త్రముల లో నొక సుందరమైన బ్రహ్మస్తోత్రము కలదని చెప్పెను. అదేది యని అడుగగా అతడు పైన జెప్పిన స్తోతమును మహానిర్యాణతంతము నుండి చదివెను. దానిని విని యాహ్లాదము 'నందితిని కానీ అద్వైత వాదముతో గూడి యుండుటచే దానిని యున్నదున్నట్లు గహింప జాలనంటిని. కావున బ్రాహ్మధర్మమున కుపయోగ పడునట్లు దానిని మార్చితిని. ఈస్తోత్రము పంచరత్నములుగా విభజింప బడియున్నది. ప్రథమరత్నమునందలి ప్రథమ చరణము,


  • నమస్తేసతే సర్వలోకాశయాయ నమస్తేచితే విశ్వరూపాత్మకాయ"