పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48

మహర్షి దేవేంద్రనాధశాకూర్ స్వీయచరిత్రము,


నేనిట్లు నూర్చి తని:-

“ నమస్తే సతే తేజగత్కారణాయ, నమస్తేచితే సర్వలోకాశ్రయాయ”

తృతీయ చతుర్థ చరణములందు,

“ నమోద్వైత తత్వాయ ముక్తి ప్రదాయ నమోబ్రహ్మణే వ్యాపినే నిర్గుణాత్మా”

అని యుండెను, నేను దీనికి బదులుగా:--

“ నమోద్వైత తత్వాయము క్తి ప్రదాయనమో బ్రహ్మణేవ్యాపినే శాశ్వతాయ”


అని మార్చితిని., ద్వితీయరత్నమునందు ద్వితీయ చరణమునందు ఈమాటలుండెను. " “త్వ మేకం జగత్కారణం విశ్వరూపం"

దానికి బదులుగా,

“ త్వమేకం జగత్పాలకం, స్వప్రకాశం,"

అని వ్రాసితిని. తృతీయ రత్న చతుర్థ చరణము నందు, “రక్షణం రక్షకానాం" ” బదులుగా “రక్షణం రక్షణానాం,” అని వాసితిని. చతుర్థరత్నమును సంపూర్ణముగ పరిత్యజించితిని. పంచమరత్నమున ప్రథమచరణము, “ త్వదేకం స్మరామో, త్వదేకం జపామః,” అనియుం డెను.“త్వ దేకం” అను శబ్ధస్థానమున, “వయంత్వం," అను శబ్దము నుంచితిని.


ఈసవరణలు చేసిన పిమ్మట చదివి చూచితిని. మిక్కిలి చక్కగనే యుండెను. బాహ్మధర్మము ప్రకారము యీశ్వరుడు విశ్వరూపము గాదు. విశ్వసష్ట కావున మొదటి పాదమునందు, రూపుడవు,జగత్కారణుఁడువు, అంటిని. రెండవచరణములో “ నీవుజ్ఞానస్వరూపుడవు సకలాశ్రయుడవు,' అంటిని; తరువాత, "నమో ద్వైత